నేడు తెరుచుకున్న సూరత్ వజ్రాల పరిశ్రమ

లాక్‌డౌన్‌తో గత రెండు నెలలుగా మూతపడిన వజ్రాల పరిశ్రమ

సూరత్‌: కరోనా లాక్‌డౌన్‌ కారణంగా రెండు నెలలుగా ముతపడిన సూరత్ వజ్రాల పరిశ్రమ ఈరోజు తెరుచుకుంది. ఈ సందర్భంగా వజ్రాల వ్యాపారులు మాట్లాడుతూ.. సూరత్ లో పరిశ్రమ ప్రారంభమైనప్పటికీ, ముంబయిలో ఇంకా ప్రారంభం కాలేదని చెప్పారు. లాక్ డౌన్ వల్ల ఎగుమతులకు పెద్ద ఆటంకం కలిగిందని, చాలా నష్టం సంభవించిందని అన్నారు. తక్కువ మంది సిబ్బందితోనే పనులను ప్రారంభించామని వారితో ఎక్కువ పని గంటలు చేయించి, అధిక జీతాన్ని చెల్లిస్తామని చెప్పారు. కాగా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారమే… కొద్ది మంది కార్మికులతోనే పనులు ప్రారంభమయ్యాయి అన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/