సూరజ్‌పూర్ కలెక్టర్ రణబీర్ శర్మసస్పెన్షన్!

యువకుడి పై చెంప దెబ్బకొట్టిన ఫలితం

Collector slapping a young man
Collector slapping a young man

Chhattisgarh: లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించాడని అంటూ ఒక యువకుడి పై చెంప దెబ్బ కొట్టిన సూరజ్‌పూర్ కలెక్టర్ రణబీర్ శర్మసస్పెన్షన్ కు గురయ్యారు. ఈ మేరకు ఛత్తీస్గడ్ సీఎం భూపేశ్ బఘేల్ ఆదేశించారు. వివరాలు ఇలా ఉన్నాయి.

ఛత్తీస్ గడ్ లో లాక్ డౌన్ కొనసాగుతోంది. సూరజ్ పూర్ జిల్లా కలెక్టర్ రణబీర్ శర్మ లాక్ డౌన్ అమలు తీరును పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో అత్యవసరంగా మందులు కొనడానికి వెళ్తున్న ఓ వ్యక్తిని కలెక్టర్ రణ్ బీర్ శర్మ, పోలీసులు అడ్డుకుని దురుసుగా ప్రవర్తించారు. ఆ వ్యక్తి మందుల చీటీలు చూపిస్తున్నా… ఫోన్ లాక్కొని నేలకోసి కొట్టి చెంప చెళ్లుమనిపించాడు.

ఇదిలా ఉండగా, కలెక్టర్ కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కలెక్టర్ తీరుపై విమర్శులు వెల్లువెత్తతాయి. కలెక్టర్‌ రణ్‌ బీర్‌ కూడా ఈ ఘటనపై స్పందించారు. తాను కావాలని చేయలేదని..అంటూ క్షమాపణలు చెప్పారు.

ప్రజలపై ఇలాంటి చర్యలను ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు. కలెక్టర్ చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు. రణబీర్‌ స్థానంలో రాయ్‌పూర్ జిల్లా పంచాయతీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గౌరవ్‌ కుమార్ సింగ్‌ ను నియమించారు.

ఇదిలా ఉండగా , రణబీర్ ప్రవర్తనను ఐఏఎస్ అసోసియేషన్ కూడా తీవ్రంగా ఖండించింది .ఆయన ప్రవర్తన ఎంతమాత్రమూ సమర్థనీయం కాదంటూ ట్వీట్ చేసింది. సేవ, నాగరితక ప్రాథమిక సిద్ధాంతాలకు ఇది పూర్తిగా విరుద్ధమని పేర్కొంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/