తెలుగు రాష్ట్రాలు మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలి

రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం హెచ్చరిక

Supreme Court
Supreme Court

న్యూఢిల్లీ: ఏపీ, తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి సంబంధించి దాఖలైన పిటిషన్‌పై జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టింది. ఇది వరకే దీనిపై నివేదిక ఇవ్వాలని సుప్రీం కోర్టు ఇరురాష్ట్రాలను ఆదేశించింది. అయితే ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు వాయిదా కోరాయి. దీంతో తాజాగా విచారణ చేపట్టిన అత్యున్నత ధర్మాసనంప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఖాళీలపై మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు ఆదేశించింది. మూడు రోజుల్లో నివేదిక ఇవ్వకపోతే ఇరురాష్ట్రాల సీఎస్‌లు తమ ఎదుట హాజరుకావాల్సి ఉంటుందనిఆదేశాలు జారీ చేసింది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/