ఆమ్రపాలి గ్రూప్ కు సుప్రీంలో ఎదురుదెబ్బ

Amrapali Group, Supreme Court
Amrapali Group, Supreme Court

న్యూఢిల్లీ: గృహనిర్మాణాల కోసం వినియోగదారుల నుంచి సేకరించిన నిధులను ఇతర సంస్థల్లోకి మళ్లించారన్న అభియోగాలను ఆమ్రపాలి యాజమాన్యం ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై ఈరోజు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఆ కంపెనీ అన్ని రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తూ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. కంపెనీ డైరెక్టర్లపై మనీ లాండరింగ్ కేసులు నమోదు చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను ఆదేశించింది. లావాదేవీలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని ఈడీకి జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలిచ్చింది. అంతేగాక నోయిడా, గ్రేటర్ నోయిడా పరిధిలో మధ్యలో ఆగిపోయిన నిర్మాణాలపైనా సుప్రీం ప్రత్యేక ఆదేశాలిచ్చింది. ఆ నిర్మాణాలను చేపట్టాల్సిందిగా నేషనల్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్‌ను సుప్రీం ఆదేశించింది. నిర్మాణాలు పూర్తైన తర్వాత వినియోగదారులకు అప్పగించాలని ఆదేశాల్లో పేర్కొంది.


తాజా ఫోటో గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/photo-gallery/