ఏపిలో ఎన్నికల వాయిదాను సమర్థించిన సుప్రీం

ఎన్నికల ఎప్పుడు నిర్వహించాలనే విషయంపై ఎన్నికల సంఘానిదే తుది నిర్ణయం

Supreme Court of India
Supreme Court of India

న్యూఢిల్లీ: ఏపిలో స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం చేసిన ప్రకటనను సవాల్ చేస్తూ ఏపి ప్రభుత్వం సుప్రీం కోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాను సుప్రీంకోర్టు సమర్థించింది. వాయిదాను కొనసాగించాలని తెలిపింది. ఎన్నికలు ఎప్పుడు నిర్ణయించాలనేది రాష్ట్ర ఎన్నికల సంఘానిదే తుది నిర్ణయమని సుప్రీకోర్టు సృష్టం చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఎన్నికల కోడ్‌ ఎత్తివేయాలని కోర్టు సూచించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ఇప్పటికే ఉన్న పథకాలను కొనసాగించవచ్చు.. కానీ, కొత్త పథకాలు ప్రారంభించవద్దని తెలిపింది. ప్రజలను ప్రలోభపెట్టే చర్యలు వద్దని సూచించింది. ఈ పిటిషన్‌పై విచారణ ముగిస్తున్నట్లు పేర్కొంది.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/