అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు

ఉప ఎన్నికల్లో పోటీ చేయ్యొచ్చు: సుప్రీంకోర్టు

Karnataka rebel MLAs
Karnataka rebel MLAs

ఢిల్లీ: ఈ ఏడాది జులైలో కర్ణాటకలో రాజకీయ సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమికి చెందిన కొందరు ఎమ్మెల్యెలు రాజీనామా చేయడంతో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. అయితే ఆ సమయంలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమికి చెందిన 17 మంది ఎమ్మెల్యేెలపై అప్పటి స్పీకర్‌ రమేష్‌ కుమార్‌ అనర్హత వేటు వేయడంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అనర్హత పడిన 17 మంది ఎమ్మెల్యేల పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పు వెల్లడించింది. ఆ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ అప్పటి స్పీకర్‌ కే ఆర్‌ రమేష్‌ కుమార్‌ తీసుకున్నా నిర్ణయాన్ని సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. అయితే 2023 వరకు వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా స్పీకర్‌ ఇచ్చిన ఆదేశాలను మాత్రం కొట్టివేసింది. దీంతో త్వరలో జరగబోయే ఉప ఎన్నికల్లో వారు పోటీ చేసేందుకు అవకాశమిస్తూ ఉరట కల్పించింది. అయితే అనర్హత ఎమ్మెల్యేెలు వచ్చే ఉప ఎన్నికల్లో పోటీ చేయొచ్చని.. ఒకవేళ గెలిస్తే మంత్రి పదవులు కూడా చేపట్టవచ్చని స్పష్టం చేసింది.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/