వచ్చేవారం హైదరాబాద్‌కు దిశ త్రిసభ్య కమిషన్‌

Disha victims encounter case
Disha victims encounter case

హైదరాబాద్‌: వచ్చేవారం దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌లో వాస్తవ విచారణకు సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిషన్‌ హైదరాబాద్‌కు రానుంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ విఎస్‌ సిర్‌పుర్కర్‌ నేతృత్వంలో బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రేఖా తొండూర్‌, సిబిఐ మాజీ డైరక్టర్‌ కార్తికేయన్‌తో ఏర్పాటైన త్రిసభ్య కమిటీ దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై నిజ నిర్థారణ జరిపనున్నారు. కాగా వీరు తొలుత గాంధీ మార్చురీలో భద్రపరచిన నలుగురి నిందితుల మృతదేహాలను పరిశీలించనున్నట్లు తెలిసింది. విచారణ ముగిన తర్వాత మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/