హార్దిక్‌ పటేల్‌కు స్టే నిరాకరించిన సుప్రీం

Hardik Patel
Hardik Patel

న్యూఢిల్లీ: పటీదార్‌ ఉద్యమ నేత, కాంగ్రెస్‌ నాయకుడు హార్దిక్‌ పటెల్‌ విసనగర్‌ అల్లర్ల కేసులో దోషిగా తేలిన విషయం తెలిసిందే. తనను దోషిగా పేర్కొనడంపై స్టే ఇవ్వాలని కోరుతూ హార్దిక్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే దీనిపై సత్వర విచారణ చేపట్టేందుకు న్యాయస్థానం నిరాకరించింది. దీంతో రానున్న ఎన్నికల్లో ఆయన పోటీ చేసే అవకాశాలు కన్పించట్లేదు. అయితే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో గుజరాత్‌లోని జమనగర్‌ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న హార్దిక్‌కు కోర్టు తీర్పుతో షాక్‌ తగిలింది. ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఏప్రిల్‌ 4లోగా నామినేషన్‌ దాఖలు చేయాల్సి ఉంది. అయితే తనను దోషిగా పేర్కొనడంపై న్యాయస్థానం ఇంకా స్టే విధించకపోవడంతో ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన అనర్హులు అవుతారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/