నిందితుల కాల్పుల్లో పోలీసులు ఎవరూ గాయపడలేదా..?

supreme court
supreme court

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ ఘటనపై సర్వోన్నత న్యాయస్థానం రెండో రోజు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరపున ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. నిందితులు తుపాకులు లాక్కుని కాల్పులు జరిపారని..ఆత్మరక్షణ కోసమే పోలీసులు ఎదురు కాల్పులు జరిపారని రోహత్గీ కోర్టుకు విన్నవించారు. అయితే పోలీసులపై నిందితులు కాల్పులు జరిపితే బుల్లెట్లు ఎక్కడా అని సుప్రీంకోర్టు ఆయనను ప్రశ్నించింది. నిందితుల కాల్పుల్లో పోలీసులు ఎవరూ గాయపడలేదా అని ప్రశ్నలు సంధించింది. ఇందుకు బదులుగా రోహత్గీ నిందితులు కాల్చిన బుల్లెట్లు దొరకలేదని న్యాయాస్థానానికి సమాధానమిచ్చారు. కాగా రిటైర్డు జడ్జితో విచారణ జరిపితే తమకు అభ్యంతరం లేదని ముకుల్‌ రోహత్గి కోర్టుకు తెలిపారు. అయితే సుప్రీంకోర్టే స్వయంగా విచారణ జరిపితే మళ్లీ జాతీయ మానవ హక్కుల కమిషన్‌ విచారణ ఎందుకని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకు స్పందనగా రెండు విచారణలు సమాంతరంగా జరిగితే అభ్యంతరం ఏముందన్న సుప్రీంకోర్టు… ఎన్‌కౌంటర్‌పై ప్రజలకు నిజానిజాలు తెలియాల్సిందేనని స్పష్టం చేసింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/