సుశాంత్‌ సింగ్‌ కేసు సీబీఐకీ అప్పగించిన సుప్రీం

సీబీఐకి అప్పగించాలని ఇటీవల బీహార్‌ ప్రభుత్వం సిఫారసు

sushant-singh-rajput

న్యూఢిల్లీ: బాలీవుడ్‌ హీరో సుశాం‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసులో సుప్రీంకోర్టు బుధవారం కీలకతీర్పు వెలువరించింది. సుశాంత్‌ ఆత్మహత్య ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది. అయితే, మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ కేసులో ఇప్పటివరకు సేకరించిన ఆధారాలను అప్పగించాలని ముంబైపోలీసులకు ఆదేశించింది. కాగా జూన్‌ 14లో సుశాంత్‌ తన నివాసంలో మృతి చెందిన విషయం తెలిసిందే. మొదటి నుంచి అనేక మలుపులు తిరుగుతున్న ఈ కేసు బాలీవుడ్‌లోనే కాకుండా రాజకీయంగానూ ప్రకంపనలు రేపుతోంది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/