చిదంబరం బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీం తీర్పు రిజర్వు

Chidambaram
Chidambaram


న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చిదంబరం ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసిన తప్పులు చిదంబరంకు ఆయన కూమరుడు కార్తీ చిదంబరంకు మరియు అధికార దుర్వినియోగంలో సహయపడిన కొందరు అధికారులకు సిబిఐ రూపంలో ఇప్పుడు కష్టాలు మొదలాయ్యాయి. ఐఎన్‌ఎక్స్‌ మీడియా అవినీతి కేసులో ఆర్థిక శాఖ మాజీమంత్రి పి.చిదంబరంకు మరియు ఈ కేసులో సంబధం ఉన్న ఇతరులకు ఢిల్లీ కోర్టులో సిబిఐ చార్జిసిట్‌ వేసింది. శుక్రవారం ప్రత్యేక కోర్టు లాల్‌ సింగ్‌కు దీనిని సమర్పించింది. ఈ చార్జీషీటులో పీటర్‌ముఖర్జీ, చార్టెర్డ్‌అకౌంటెంట్‌ ఎస్‌. భాస్కరరామన్‌, నీతి ఆయోగ్‌ మాజీ సిఈవో సింధుశ్రీ ఖుల్లర్‌, మాజీ ఉన్నతాధికారులు అనుప్‌ కె.పూజారి, ప్రబోధ్‌ సక్సేనా, రవీంద్ర ప్రసాద్‌లతో పాటు ఐఎన్‌ఎక్స్‌ మీడియా, ఏస్‌సీఎల్‌ అండ్‌ చెస్‌ మెనెజ్‌మెంట్‌ సర్వీసెస్‌ సంస్థల పేర్లున్నాయి. అప్రూవర్‌గా మారిన మరో నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీ పేరు కూడా ఇందులో ఉంది. వీరిపై అవినీతి నిరోధక చట్టం, భారతీయ శిక్షాస్మృతి కింద పలు అభియోగాలు మోపింది. ఈ కేసులో చిదంబరం పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు వాదనలు విన్న తీర్పును రిజర్వులో ఉంచింది. అధికారం ఉన్నప్పుడు అవినీతి పాల్పడితే అధికారం మారక తిప్పలు తప్పవని చిదంబరం కేసును చూస్తే అర్థమవుతుంది.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/