దివ్యాంగుల‌కు వ్యాక్సినేష‌న్‌ పై సుప్రీంలో విచారణ

కేంద్రానికి సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ : దివ్యాంగుల‌కు కోవిడ్ టీకాలు ఇచ్చేందుకు ప్ర‌భుత్వం ఎటువంటి చ‌ర్య‌లు తీసుకున్న‌దో వెల్ల‌డించాల‌ని నేడు సుప్రీంకోర్టు కోరింది. డీవై చంద్ర‌చూడ్‌, బీవీ నాగ‌ర‌త్న‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ అంశంపై విచార‌ణ చేప‌ట్టింది. ఎన్జీవో ఎవ‌రా ఫౌండేష‌న్ వేసిన పిటిష‌న్‌కు కోర్టు స్పందించింది. రెండు వారాల్లోగా ఈ అంశంపై కేంద్రం వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కోర్టు ఆదేశించింది. దివ్యాంగుల‌కు వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్ర‌భుత్వం అన్ని ఏర్పాట్లు చేయాల‌ని పిటిష‌న్‌లో కోరారు. వ్యాక్సిన్ స్లాట్ల స‌మ‌యంలో దివ్యాంగుల‌కు ప్రిఫ‌రెన్స్ ఇవ్వాల‌ని ఎన్జీవో కోర్టును కోరింది. కోవిన్‌తో పాటు వ్యాక్సిన్ బుకింగ్ కోసం

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/