హిజాబ్ ధార‌ణ‌..కర్ణాటక ప్ర‌భుత్వానికి సుప్రీం నోటీసు జారీ

Supreme Court issues notice to Karnataka on pleas against Karnataka High Court order refusing to lift ban on hijab

న్యూఢిల్లీః కర్ణాటక ప్ర‌భుత్వం రాష్ట్ర‌వ్యాప్తంగా విద్యా సంస్థ‌ల్లో హిజాబ్ ధార‌ణ‌పై నిషేధం విధించిన విష‌యం తెలిసిందే. అయితే ఆ నిషేధాన్ని ఎత్తివేయాల‌ని వేసిన పిటిష‌న్ల‌ను కర్ణాటక హైకోర్టు తిర‌స్క‌రించింది. ఈ నేప‌థ్యంలో ఆ అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రిగింది. జ‌స్టిస్ హేమంత గుప్తా, సుధాన్షు దులియాల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ కేసును విచారించింది. హిజాబ్ బ్యాన్ ఎత్తివేత అంశంపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కోరుతూ క‌ర్నాట‌క ప్ర‌భుత్వానికి సుప్రీం నోటీసులు జారీ చేసింది. ఈ కేసును మ‌ళ్లీ సెప్టెంబ‌ర్ 5వ తేదీన విచారించ‌నున్న‌ట్లు కోర్టు తెలిపింది. క్లాస్‌రూమ్‌లో హిజాబ్ ధ‌రించే అనుమ‌తి ఇవ్వాల‌ని ఉడిపిలోని ప్ర‌భుత్వ కాలేజీ ముస్లిం అమ్మాయిలు కర్ణాటక హైకోర్టులో పిటిష‌న్ వేశారు. అయితే ఆ పిటిష‌న్‌ను కోర్టు తిర‌స్క‌రించింది. ఆ తీర్పును వ్య‌తిరేకిస్తూ సుప్రీంలో ప‌లు పిటిష‌న్లు దాఖ‌లు చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/