రాహుల్‌గాంధీకి సుప్రీం నోటీసులు

Rahul Gandhi
Rahul Gandhi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి సుప్రీంకోర్టు కోర్టు దిక్కరణ కేసులో నోటీసులు జారీ చేసింది. రఫేల్‌ వివాదంపై సుప్రీంకోర్టు ఎన్నడూ చేయని వ్యాఖ్యలను రాహుల్‌ ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నారని ‘చౌకిదారే దొంగ’ అంటు తన అభిప్రాయాలను న్యాయస్థానానికి ఆపాదిస్తున్నారని ఆరోపిస్తూ బిజెపి ఎంపి మీనాక్షీ లేఖీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం. రాహుల్‌కు నోటీసలు జారీ చేసింది. కాగా రాహుల్‌ గాంధీ మీడియాలో అన్నట్లుగా తాము ఎప్పుడూ వ్యాఖ్యానించలేదని, అలాంటి అభిప్రాయాలను కూడా వెల్లడించలేదని కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. దీనిపై ఈ నెల 22లోగా రాహుల్‌ సమాధానం ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌చేయండి:https://www.vaartha.com/news/national/