ధోనితో ఉన్న లావాదేవీల పూర్తి వివరాలు కావాలి

ఆమ్రపాలి సంస్థను ఆదేశించిన సుప్రీంకోర్టు

dhoni
dhoni, indian cricketer

న్యూఢిల్లీ: ఆమ్రపాలి రియల్‌ ఎస్టేల్‌ సంస్థ తనకు బకాయిలు చెల్లించలేదంటూ క్రికెటర్‌ ధోని సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఐతే ఆ కేసులో ధోనితో ఎటువంటి లావాదేవీలు జరిగాయో పూర్తి వివరాలు పంపాల్సిందిగా ఇవాళ ఆమ్రపాలి సంస్థను సుప్రీం ఆదేశించింది. ఈ సంస్థకు ధోని 2009-16 వరకు పనిచేశారు. ఐతే రాంచీలో నిర్మిస్తున్న ఆమ్రపాలి ప్రాజెక్టులో ఓ పెంట్‌హౌస్‌ బుక్‌ చేసుకున్నానని, దాన్ని తనకు అప్పగించే ఆ సంస్థపై చర్యలు తీసుకోవాలని ధోని సుప్రీంను కోరాడు.
కానీ కొన్ని నెలల క్రితం ధోని అంబాసిడర్‌ డీల్‌ నుంచి వైదొలిగాడు. నోయిడాలో కంపెనీ ఏర్పాటు చేసిన గృహ ప్రాజెక్టుపై కొనుగోలుదారుల నుంచి తీవ్రత అసంతృప్తి వ్యక్తం కావడంతో ధోని ఈ నిర్ణయం తీసుకున్నాడు. ధోని ఇకపై తమ సంస్థ తరఫున ప్రచారం చేయబోరని కూడా ఆమ్రపాలి సిఎండి అనిల్‌ శర్మ ప్రకటించారు. ఈ నిర్ణయం ధోనితో కలిసి తీసుకున్నదేనని ఆయన స్పష్టం చేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/