ఈ విషయంలో జోక్యం చేసుకోలేం

మద్యం అమ్మకాలను నిషేధించాలని ఆదేశాలివ్వలేమని స్పష్టం చేసిన సుప్రీం కోర్టు

supreme court
supreme court

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టులో మద్యం అమ్మకాలపై నిషేధం విధించాలంటు పలు పిటిషన్లు దాఖలుకాగా.. ఈపిటిషన్లును సుప్రీం ఈరోజు విచారించింది. ఈనేపథ్యంలో మద్యం అమ్మకాలను నిషేధించాలని ఆదేశాలివ్వలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. మద్యం అమ్మకాలపై రాష్ట్రాలవి విధానపరమైన నిర్ణయాలని.. ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. అయితే రాష్ట్రాలు మద్యం అమ్మకాలకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను పాటించాలని ధర్మాసనం సూచించింది. రాష్ట్రాలు మద్యం అమ్మకాలకు ఆన్‌లైన్‌ విధానాన్ని అనుసరించాలని, ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకున్న వారికి మద్యాన్ని హోం డెలివరీ చేయాలని సుప్రీం కోర్టు రాష్ట్రాలకు సూచించింది.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/