అర్ణబ్‌కు సుప్రీంలో ఊరట

రూ.50 వేల ష్యూరిటీతో బెయిల్ ఇవ్వాలని సుప్రీం ఆదేశాలు

అర్ణబ్‌కు సుప్రీంలో ఊరట
Arnab Goswami

న్యూఢిల్లీ: ప్రముఖ జర్నలిస్టు అర్ణబ్‌ గోస్వామికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనను మధ్యంతర బెయిల్ పై విడుదల చేయాలంటూ అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు ఇచ్చింది. అర్ణబ్ భావజాలం ఎలాంటిదైనా వ్యక్తి స్వేచ్ఛను హరించడం సబబు కాదని ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం పేర్కొంది. కాగా, ఈ కేసులో బాంబే హైకోర్టులో బెయిల్ రాకపోవడంతో అర్ణబ్ గోస్వామి సుప్రీంను ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం రూ.50 వేల ష్యూరిటీతో బెయిల్ మంజూరు చేయాలంటూ ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని ముంబయి పోలీస్ కమిషనర్ కార్యాలయానికి స్పష్టం చేసింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/