వీవీప్యాట్‌ లెక్కింపు పిటిషన్‌ కొట్టివేత

Supreme Court
Supreme Court

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా వీవీప్యాట్‌ స్లిప్పులు 100శాతం సరిపోలేలా చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను పై ఈరోజు సుప్రీంలో విచారణ జరిగింది. ఆ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. న్యాయస్థానం పిటిషన్‌దారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖఈ వ్యవహారంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలోని విస్తృత ధర్మాసనం ఇప్పటికే తీర్పు వెల్లడించింది. మళ్లీ ఎందుకు ఇద్దరు న్యాయమూర్తుల వెకేషన్‌ బెంచ్‌ ముందుకు పిటిషన్‌ తీసుకొచ్చారు. సీజేఐ తీర్పును మేం అధిగమించలేం. ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకునే ప్రక్రియలో మేం జోక్యం చేసుకోలేం. ఇలాంటి అర్థం లేని పిటిషన్‌ను మేం విచారించబోం. దీన్ని కొట్టివేస్తున్నాంగ అని ధర్మాసం వెల్లడించింది. ఈ పిటిషన్‌ చెన్నైకు చెందిన టెక్‌ ఫర్‌ ఆల్‌ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసింది.


మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/