సుప్రీంకోర్టులో జీవన్‌రెడ్డి పిటిషన్‌ కొట్టివేత

సచివాలయం కూల్చివేత ..ఇందులో తాము జోక్యం చేసుకోబోము…

సుప్రీంకోర్టులో జీవన్‌రెడ్డి పిటిషన్‌ కొట్టివేత
Jeevan reddy

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తెలంగాణ సచివాలయం కూల్చివేతకు సంబంధించి దాఖలు చేసిన పిటిషన్‌ సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ అంశాన్ని రాష్ట్ర హైకోర్టు సమగ్రంగా పరిశీలించిందని.. ఇందులో తాము జోక్యం చేసుకోబోమని జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా, సెక్రటేరియెట్ కూల్చివేతపై శుక్రవారంపై తెలంగాణ హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. సచివాలయ భవనాల కూల్చివేతకు పర్యావరణ అనుమతి అవసరమా? లేదా అన్నదానిపై స్పష్టత ఇవ్వాలని బుధవారం ప్రభుత్వాన్ని కోరింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/