నిర్భయ దోషుల క్యురేటివ్‌ పిటిషన్లు కొటివేసిన సుప్రీం

Supreme Court of India
Supreme Court of India

న్యూఢిల్లీ: నిర్భయ హత్యాచారం కేసులో ఉరిశిక్ష పడిన నిందితులు వినయ్ కుమార్ శర్మ, ముఖేశ్ సింగ్ పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్లను సుప్రీంకో్ర్టు కొట్టివేసింది. ఈ మేరకు ఈరోజు సుప్రీంకోర్టు ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. కాగా ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు పవన్ గుప్త, అక్షయ్ ఇప్పటి వరకు ఎలాంటి పిటిషన్ దాఖలు చేయలేదు. మరోవైపు నిందితులను ఈ నెల 22న ఉదయం 7గంటలకు ఉరితీయాలంటూ ఢిల్లీ హైకోర్టు ఈ నెల 7న డెత్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. డెత్ వారెంట్ జారీ కాగానే వినయ్, ముఖేశ్‌లిద్దరూ విడివిడిగా రెండు క్యూరేటివ్ పిటిషన్లు దాఖలు చేశారు. తమకు విధించిన ఉరిశిక్ష‌పై స్టే విధించాలంటూ విన్నవించారు. ఉరిశిక్షకు ముందు ఉపశమనానికి కోర్టు పరంగా క్యూరేటివ్ పిటిషన్ ఒక్కటే మార్గం. ఇప్పుడు కోర్టు తమ క్యూరేటివ్ పిటిషన్‌ను కొట్టివేయడంతో నిందితులు రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకునే అవకాశం ఉంది. క్షమాభిక్షకు రాష్ట్రపతి తిరస్కరిస్తే ఇక ఉరే తరువాయి అవుతుంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/