సీజేల నియామకాలకు సుప్రీం కొలీజియం సీఫార్సు

Supreme Court
Supreme Court

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు నాలుగు రాష్ట్రాల హైకోర్టులకు సీజేల నియమకాలకు కొలీజియం సిఫారసు చేసింది. తెలంగాణ, హిమచల్‌ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఢిల్లీ హైకోర్టుల సీజేల నియామకానికి కొలీజీయం సిఫారసు చేసింది. అయితే తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్‌ను నియమించాలని సిఫారసు చేసింది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టుకు ఆయన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు సీజేగా జస్టిస్ వి.రామ సుబ్రమణియన్‌ను కొలిజియం సిఫారసు చేసింది. ప్రస్తుతం ఆయన తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ హైకోర్టు సీజేగా డీఎన్ పటేల్‌ను కొలీజియం సిఫారసు చేసింది. మధ్యప్రదేశ్ హైకోర్టు సీజేగా జస్టీస్ ఏఏ ఖురేషిని సిఫారసు చేసింది.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/