ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం


సిఎం ఫడ్నవిస్‌కు క్లీన్‌చిట్‌ రద్దుచేసిన సుప్రీం

Devendra fadnavis
Devendra fadnavis


న్యూఢిల్లీ: ఎన్నికల్లో దాఖలుచేసిన అఫిడవిట్‌కేసులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు కోర్టు ఇచ్చిన క్లీన్‌చిట్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీనితో ఇపుడు ఆయనపై దాఖలయిన పిటిషన్‌ విచారణకు మార్గం ఏర్పడింది. సుప్రీంకోర్టు మంగళవారం దిగువకోర్టు ఇచ్చిన క్లీన్‌చిట్‌ ఉత్తర్వులను పక్కనపెట్టింది. దిగువకోర్టుతోపాటు సబాంబే హైకోర్టుసైతం ఆయనకు క్లీన్‌చిట్‌ ఇచ్చాయి. ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్‌ను దాఖలుచేసారని ఆయన ఎన్నిక చెల్లదంటూ కోర్టులో దాఖలయిన పిటిషన్‌పై విచారణకోర్టు, హైకోర్టులు జారీచేసిన క్లీన్‌చిట్‌ను సుప్రీంకోర్టు పక్కనపెట్టడంతో ఇపుడు ఫడ్నవిస్‌కు ఎన్నికల సమయంలో చిక్కులు వచ్చిపడ్డాయి. చీఫ్‌జస్టిస్‌ రంజన్‌గగో§్‌ు, జస్టిస్‌ దీపక్‌ గుప్తా, అనిరుద్ధబోస్‌లు మాట్లాడుతూ ఫడ్నవిస్‌కు అఫిడవిట్‌కేసులో ఇచ్చిన క్లీన్‌చిట్‌ ఆమోదయోగ్యం కాదని, చట్టప్రకారం కొట్టివేసేందుకు అన్ని అర్హతులున్నట్లు న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. సతీష్‌ ఊకే అనే పిటిషనర్‌ ఈ కేసును దాఖలుచేసారు.

ఎన్నికల్లో దాకలుచేసిన అఫిడవిట్‌ లో తనపై పెండింగ్‌లో ఉనన రెండు క్రిమినల్‌కేసుల వివరాలను పొందుపరచలేదని, 2014 ఎన్నికల అఫిడవిట్‌లో ఫడ్నవిస్‌ తప్పుడు సమాచారం ఇచ్చారని ఆయన ఆరోపించారు. ప్రజాప్రతినిధ్యచట్టం సెక్షన్‌ 125ఎ ప్రకారం ఆయన ఉల్లంఘించినట్లయిందని, రెండుకేసుల్లోను ఆయనపై చీటింగ్‌, ఫోర్జరీకేసులు నమోదయ్యాయయని ఆయన వాదించారు. 1996లో ఒకకేసు, 1998లో మరోకేసు నమోదయ్యాయి. జులై 23వ తేదీ టాప్‌కోర్టు తీర్పును రిజర్వులో ఉంచుతూ రెండుక్రిమినల్‌కేసుల వివరాలను వెల్లడించకపోవడం అంశాన్ని విచారణలో నిర్ణయిస్తామని వెల్లడించింది. ఈకేసులో ప్రజాప్రాతినిధ్య చట్టం 125ఎ వర్తిస్తుందా లేదా అన్నద నిర్ణయించాల్సి ఉందని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈకేసులో ఈ సెక్షన్‌కిం దనేరం రుజువయితే తప్పుడు అఫిడవిట్‌ఇచ్చినందుకు జరిమానా విధిస్తారు. ఒక అభ్యర్ధి లేదా ఆయన్ను ప్రతిపాదించిన వ్యక్తి తప్పుడు సమాచారం ఇచ్చినపక్షంలో ఆయన నామినేషన్‌పత్రాల్లో సరైన సమాచారం ఇవ్వనిపక్షంలో చర్యలకు ఆస్కారం ఉంది. అందులోనూ క్రిమినల్‌కేసులు పెండింగ్‌లో ఉండటం వంటి అంశాలపై ఆరునెలల జైలుశిక్ష లేదా జరిమానా జైలుశిక్ష రెండూ విధిస్తారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/