డిస్‌ఇన్‌ఫెక్షన్‌ టన్నెళ్లను రద్దు చేయాలి..సుప్రీం

కేంద్రప్రభుత్వానికి నెలరోజుల గుడువు విధింపు

supremcourt-directs-centre-to-ban-covid-19-disinfection-tunnels

న్యూఢిల్లీ: డిస్‌ ఇన్‌ఫెక్షన్‌ టన్నెళ్ల వినియోగాన్ని నిషేధిస్తూ ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేయాలని సుప్రీం కోర్టు కేందాన్ని ఆదేశించింది. డిస్‌ఇన్‌ఫెక్షన్‌ టన్నెళ్లు, అతినీలలోహిత కిరణాల వంటి వాడకం ఆర్యోగంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, రసాయనాల పిచికారీ, అల్ట్రా వైలెట్‌ కిరణాల ప్రసారం, టన్నెల్స్ ఇన్‌స్టాలేషన్, ఉత్పత్తి, ప్రచారాన్ని నిషేధిస్తూ కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాలని దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. డిస్‌ఇన్ఫెక్షన్‌ టన్నెళ్లు మనుషులపై మానసికంగా, శారీరంగా చెడు ప్రభావం చూపుతాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. అలాంటప్పుడు వాటి వాడకాన్ని ఎందుకు నిషేధించలేదని సెప్టెంబన్‌ 7న కేంద్రాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రజారోగ్యం, ఆస్పత్రులు రాష్ట్రల పరిధిలోని విషయమని, వాటిపై మార్గదర్శకాలు విడుదల చేయాల్సింది రాష్ట్రాలేనని సుప్రీం కోర్టులో కేంద్రం అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో టన్నెళ్ల వినియోగాన్ని నిషేధిస్తూ నెల రోజుల్లోపు మార్గదర్శకాలు జారీ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/