ఇకపై వాట్సప్‌ ద్వారా కోర్టు నోటీసులు..సుప్రీంకోర్టు

ఇకపై సమన్లు నోటీసులను ఈమెయిల్, వాట్సాప్, ఫ్యాక్స్ చేయొచ్చన్న ధర్మాసనం

Supreme Court Allows Service of Summons by Whatsapp, Email, Fax

న్యూఢిల్లీ: కరోనా వ్యాపి నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సుప్రీంకోర్టు భావిస్తోంది. ఈ క్రమంలో ఇకపై కోర్టు సమన్లు, నోటీసులను ఈమెయిల్, ఫ్యాక్స్, వాట్సాప్ వంటి వాటి ద్వారా పంపించ వచ్చని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఆర్ సుభాష్‌రెడ్డి, జిస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. కొవిడ్ నేపథ్యంలో న్యాయవాదులు, కక్షిదారుల ఇబ్బందులను పరిశీలించిన ధర్మాసనం ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించి ఈ మేరకు నిర్ణయించింది. వాట్సాప్‌లో మనం పంపిన మెసేజ్ అవతలి వాళ్లు చూస్తే… బ్లూ కలర్ రైట్ మార్క్ కనిపిస్తుంది కదా… అలా నోటీస్ పంపినప్పుడు దాన్ని చూడగానే ఆ మార్క్ కనిపిస్తుందని జస్టిస్‌ ఎస్‌.బోపన్న, జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌ రెడ్డిల ద్విసభ్య ధర్మాసనం తెలిపింది. ఐతే… కొంతమంది ఇలా బ్లూ మార్క్ కనపడకుండా వాట్సాప్ సెట్టింగ్స్‌లో ఆప్షన్లు మార్చుకుంటారు. అయినప్పటికీ… నోటీస్ పంపినట్లైతే ప్రూఫ్ కచ్చితంగా ఉంటుంది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/