ఆర్టికల్‌ 35ఏపై వాదనలు

SUPREME COURT
SUPREME COURT

ఆర్టికల్‌ 35ఏపై వాదనలు

న్యూఢిల్లీ : : ఆర్టికల్‌ 35ఏపై సోమవారం సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. చీప్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశంపై కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేసింది. ఆర్టికల్‌ 35 ప్రకారం జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక హోదా లభిస్తుంది. అయితే ఈ హోదా ఇవ్వడం రాజ్యాంగ విరుద్దమా లేదా అన్న అంశాన్ని పరిశీలించనున్నట్లు చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా తెలిపారు. కేశవానంద భారతి కేసులో 13 మంది సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఆధారం చేసుకుని ఆర్టికల్‌ 35 ఏపై తమ తీర్పును వెల్లడిస్తామని చీఫ్‌ జస్టిస్‌ తెలిపారు. అయితే కేసును వాయిదా వేయాలని అటార్నీ జనరల్‌ కెకె వేణుగోపాల్‌ సుప్రీంను డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం బెంచ్‌లో ఉన్న మిగతా ఇద్దరు సభ్యుల్లో ఒకరు లీవ్‌లో ఉన్నారని, దీంతో కేసులు వాయిదా వేస్తున్నట్లు దీపక్‌ మిశ్రా తెలిపారు. త్రిసభ్య ధర్మాసనంకు సిఫార్సు చేయాలా వద్దా అన్న కోణంలోనూ ఆలోచిస్తున్నారు.

ఆగస్టు 26 తర్వాత ఈ కేసులో మళ్లీ వాదనలు ఉంటాయి. మరోవైపు ఆర్టికల్‌ 35ఏ కేసు సుప్రీం బెంచ్‌ ముందుకు వచ్చిందని తెలియగానే కాశ్మీర్‌లో ఆందోళనలు మిన్నంటాయి.