మోసపోతున్న మహిళలకు అండ

Manju: support to women

ఉపాధి కోసం సౌదీకి వచ్చి, బానిసల్లా బతుకుతున్నామని బాధపడేవారు. కాంట్రాక్టర్‌ చేతిలో పాస్‌పోర్ట్‌ ఉండిపోవడంతో దిక్కుతోచక బానిసల్లా కాలాన్ని గడు పుతున్నామని చెప్పేవారు. సొంతవారితో మాట్లాడలేక, వారిని కల వలేక కష్టపడుతున్న వారిని చూసే ప్రతిసారీ మంజు చలిం చిపోయేది. వారినెలాగైనా మాతృభూమికి పంపిం చాలని ఆలోచించేది.

బతుకుతెరువు కోసం గల్ఫ్‌దేశాలకు వెళ్తున్న మహిళలు, బాలికల వ్యధలు అన్నీఇన్నీ కావ్ఞ. ధనవంతుల ఇళ్లలో పనిమనిషిగా వెళ్లి, అక్కడికి వెళ్లిన తర్వాత ఏజెంట్ల ద్వారా మోసపోయి, తిరిగి వచ్చేందుకు పాస్‌పోర్టులు లేక, డబ్బులేక అక్కడే మగ్గిపోతున్న మహిళలు ఎందరో ఉన్నారు. రోజుకు 16, 18 గంటలు వెట్టిచాకిరీ చేస్తూ, ఆదరించే మనసులేక, ఆదుకునే నాధుడు లేక అల్లాడిపోతున్న వారికి చేయూతనిచ్చేందుకు ఓ మహిళ ముందుకు వచ్చింది. అంతేకాదు వారిని తిరిగి మనదేశానికి పంపిస్తూ, వారి జీవితంలో మళ్లీ వెలుగును నింపేందుకు ప్రయత్నిస్తున్నది. ఆమె పేరు మంజుమణికుట్టన్‌. దేశం కాని దేశంలో, భాష తెలియని ప్రాంతంలో వారు పడుతున్న ఇబ్బందులను స్వయానా చూసిన మంజు చలించిపోయారు. ఎలాగైనా వారిని స్వదేశానికి పంపాలనుకుంది. శ్రమించి, సాధించింది. గత ఆరేళ్లుగా దాదాపు వెయ్యిమంది మహిళలను అక్కడి నుంచి విముక్తినిప్పించింది.
సొంతరాష్ట్రం కేరళ
కేరళ, ఎర్నాకులం జిల్లా, పెరంబూరుకు చెందిన మంజు మణికుట్టన్‌ భర్త సౌదీలో ఉద్యోగం చేసేవారు. దాంతో మంజు కూడా భర్తతోపాటు ఎనిమిదేళ్లక్రితం సౌదీకి వెళ్లింది. ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు మంజు అక్కడ పనిచేసే మహిళలను చూసేది. వారిలో చాలామంది మనదేశానికి చెందినవారే. దాంతో వారిని పలుకరించేది. వాళ్లు తమ సమస్యల్ని మంజుకు రహస్యంగా చెప్పేవారు. ఉపాధి కోసం సౌదీకి వచ్చి, బానిసల్లా బతుకుతున్నామని బాధపడేవారు. కాంట్రాక్టర్‌ చేతిలో పాస్‌పోర్ట్‌ ఉండిపోవడంతో దిక్కుతోచక బానిసల్లా కాలాన్ని గడుపుతున్నామని చెప్పేవారు. సొంతవారితో మాట్లాడలేక, వారిని కలవలేక కష్టపడుతున్న వారిని చూసే ప్రతిసారీ మంజు చలించిపోయేది. వారినెలాగైనా మాతృభూమికి పంపించాలని ఆలోచించేది. అయితే ఎటువంటి ధ్రువపత్రాలు లేకుండా విదేశం నుంచి మనదేశానికి పంపించాలంటే అంత తేలికైన విషయం కాదని మంజుకు అర్ధమైంది. సౌదీలో ధనికుల ఇళ్లల్లో పనిప్పిస్తామని చెప్పి, కాంట్రాక్టర్లు మనదేశంలోని మారుమూల గ్రామాల నుంచి మహిళలను సౌదీకి తరలిస్తారని చెబుతుంది మంజు. ఇక్కడికొచ్చేవారంతా నిరుపేదలు, నిరక్షరాస్యులే. ఇంటి అవసరాల దృష్ట్య కుటుంబాలను వదిలి వస్తారు. ఆ తరువాతే మోసానికి గురయ్యామని తెలుసుకుంటారు. ఇక్కడ ఉండాల్సిన కాలపరిమితి వంటి అంశాలపై వీరికి అవగాహన ఉండదు. కొందరు మధ్యవర్తులైతే, పాస్‌పోర్టు వీరికివ్వరు. దాంతో స్వదేశానికి వెళ్లలేరు. అలాగే యజమాని నుంచి వీరికి అనుమతి దొరకదు. ఇటువంటి మహిళలనెందరినో గుర్తించి, విముక్తినందించాలనుకున్నా. విదేశానికి కాంట్రాక్టుపై వచ్చేవారికి ఆయాదేశ రాయబార కార్యాలయం నుంచి అనుమతి త్వరగా లభ్యం కాదు. సౌదీలోని మనదేశ రాయబార కార్యాలయ అధికారులను కలుసుకునేదాన్ని, అప్పుడే సామాజిక సేవాసంస్థలైన ‘దమ్మమ్‌ డిపోర్టేషన్‌ సెంటర్‌, ‘నవయుగం కల్చరల్‌ ఫోరంల గురించి తెలిసింది. ఇవి అక్కడ ఉండే భారతీయులకు చేయూత నందించడానికి కృషి చేస్తున్నాయి. అలా అక్కడి భారత రాయబార కార్యాలయ అధికారులకు వినతిపత్రాలు సమర్పించా. భారతీయ మహిళలు స్వదేశానికి చేరుకోవడానికి అనుమతి ఇప్పించమని, సరైన ధ్రువపత్రాలను సమకూర్చడానికి చేయూతనివ్వాల్సిందిగా అభ్యర్థించాను అంటారు మంజు.

బాధితుల దరఖాస్తు మేరకు రాయబార కార్యాలయం అధికారులు విచారణ జరుపుతారు. ఆ తరువాత వారిని స్వదేశానికి పంపడానికి ఆ ప్రభుత్వంతో చర్చించి, ధ్రువపత్రాలు వచ్చేలా కృషి చేస్తారు. అలా ఆరేళ్ల నుంచి దాదాపు వెయ్యిమందికి పైగా బాధితులను మనదేశానికి పంపగలిగారు. తిరిగి వెళ్లేటప్పు డు వారి కళ్లల్లో కనిపించే ఆనం దం నా కష్టాన్ని మరిపిస్తుంది. ఈమె సేవను గురించిన కేంద్ర ప్రభుత్వం ‘నారీశక్తి అవార్డుతో సత్కరించింది.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/