పవర్‌స్టార్‌కు సూపర్‌స్టార్‌ ట్వీట్‌

బర్త్‌డే విషెస్‌ తెలిపిన మహేష్‌బాబు

Superstar tweet to Powerstar
Superstar tweet to Powerstar

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ 49వ పుట్టినరోజు సందర్భంగా సోషల్‌మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి..

మెగా అభిమానులతోపాటు సినీ,రాజకీయ ప్రముఖులు పవన్‌ కల్యాణ్‌కుబర్త్‌డే విషెస్‌ అందజేశారు. అందరూ పవన్‌తో కలిసి ఉన్న ఫొటోలను షేర్‌ చేస్తూ, వారి అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

ఈక్రమంలో సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు పవన్‌ను ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్‌ ప్రత్యేకతను చాటుకుంది.. మహేష్‌బాబు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపటంతో మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు..

కాగా మహేష్‌బాబు ట్విట్టర్‌ వేదికగా,, ‘మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు పవన్‌కల్యాణ్‌..నీ దయాగుణం మరియు వినయం ఎల్లపుడూ మార్పును ప్రేరేపిస్తున్నాయి.. మీకు ఎల్లప్పుడూ ఆనందంతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ‘అంటూ ట్వీట్‌ చేశారు.

దీనికి పవన్‌కల్యాణ్‌తో కలిసి ఉన్న ఓ అరుదైనఫొటోను కూడ మహేష్‌ షేర్‌ చేశారు..

ఈ ట్వీట్‌కు అభిమానులు పెద్దఎత్తున లైక్స్‌ కొడుతూ రీ ట్వీట్స్‌ చేస్తున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/