ట్రంప్ తో తలపడే ప్రత్యర్థి ఎవరు?

డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ఎవరన్నది నేడు తేలుతుంది

Donald Trump-Berney Sanders

Berney Sanders -Donald Trump

అమెరికా: అమెరికా అధ్యక్షు ఎన్నికలు ఈసంవత్సరం నవంబర్‌లో జరుగనున్నాయి. ఈనేపథ్యంలో అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తో తలపడే డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ఎవరన్నది నేడు తేలుతుంది. ప్రస్తుత అధ్యక్షునిగా రిపబ్లికన్‌ పార్టీ తరఫున అభ్యర్థిగా ట్రంప్ బరిలోకి దిగనుండగా, కాలిఫోర్నియా, టెక్సాస్‌, వర్జీనియా, ఉత్తర కరోలినాతో పాటు మొత్తం 14 ప్రధాన రాష్ట్రాలకు చెందిన డెమోక్రటిక్‌ పార్టీ రిప్రజెంటేటివ్స్, ఓటు వేసి, తన పార్టీ తరఫున అభ్యర్థిని ఖరారు చేయనున్నారు. దీంతో మార్చి 3ను ఖసూపర్‌ ట్యూజ్‌ డేగగా అమెరికన్లు అభివర్ణిస్తున్నారు. కాగా, ఈ రేసులో బెర్నీ శాండర్స్‌ ముందంజలో ఉండగా, దాదాపు అతని పేరే ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదే సమయంలో మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్‌ నుంచి బెర్నీ శాండర్స్ కు గట్టి పోటీ ఎదురు కానుందని అంచనా.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/