సూపర్ స్టార్ కొత్త సినిమా కబురు
ఉగాది కానుకగా మహేష్ కొత్త సినిమా
ప్రకటన

‘సరిలేరు నీకెవ్వరు’ విడుదలైన రెండు నెలలు అవుతుంది. ఆ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కాగా సూపర్ స్టార్ మహేష్ కొత్త సినిమా కబురు లేదు. గతంలో వంశీ పైడిపల్లితో మూవీ ఉంటుందని వార్తలు వచ్చాయి. ఉగాది కానుకగా తదుపరి ప్రాజెక్ట్ ప్రకటనవచ్చే అవకాశం ఉందని అంటున్నారు
మహేష్ ప్రస్తుతం ఒప్పదం చేసుకున్న వాణిజ్య ప్రకటనల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఐతే మహేష్ ఫ్యాన్స్ లో ఆయన కొత్త మూవీ ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఉగాది కానుకగా మహేష్ తన తదుపరి ప్రాజెక్ట్ ప్రకటించే అవకాశం కలదు. మహేష్ తో మూవీ చేయడానికి అనేక నిర్మాణ సంస్థలు సిద్ధంగా ఉండగా, ఆయన స్క్రిప్ట్ అండ్ డైరెక్టర్ ని ఎంచుకోవడమే తరువాయి.
కొద్దిరోజులుగా మహేష్ కథలు వింటున్నాడంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో తెలుగు నూతన సంవత్సరాదిన ఆయన కొత్త మూవీ ప్రకటన చేసే అవకాశం ఉందంటున్నారు
తాజా ‘మొగ్గ’ (చిన్నారుల ప్రత్యేకం వ్యాసాల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/specials/kids/