గత ఐదేళ్లుగా దేశంలో ‘సూపర్‌ ఎమర్జెన్సీ’

Mamata Banerjee
Mamata Banerjee, west bengal cm


కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్‌ సియం మమతా బెనర్జీ బిజెపి మీద మరోసారి విమర్శల వర్షం కురిపించారు. గత ఐదేళ్లుగా దేశం సూపర్‌ ఎమర్జెన్సీలో మగ్గిపోతుందని మండిపడ్డారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో జూన్‌ 25, 1975న దేశంలో ఎమర్జెన్సీ విధించిన సంగతి తెలిసిందే. అప్పటి రోజులను గుర్తు చేసుకుంటూ మమత ట్విట్టర్‌ వేదికగా బిజెపి మీద విరుచుకుపడ్డారు. మనం చరిత్ర నుంచి పాఠాలు నేర్వాలి. దేశంలో ఉన్న ప్రాజాస్వామ్మ సంస్థలను పరిరక్షించుకోవడానికి పోరాటం చేయాలి అని ఆమె ట్వీట్‌ చేశారు. ఇప్పటికీ పశ్చిమ బెంగాల్‌లో బిజెపి, తృణమూల్‌ పార్టీల మధ్య ఘర్షణలు చెలరేగుతూనే ఉన్నాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని మమత బిజెపి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా హీరోల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actors/