సన్‌రైజర్స్‌తో జతకట్టిన గ్రాడో…

హైదరాబాద్‌: ఓసిఎం, జీబిటిఎల్‌ గ్రూప్‌కి చెందిన ప్రముఖ దుస్తుల బ్రాండ్‌ ‘గ్రాడో….నగరానికి చెందిన ఐపిఎల్‌ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జతకట్టింది. రైజర్స్‌ జట్టుకు ప్రధాన స్పాన్సర్‌గా ఒప్పందం కుదిరినట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఒప్పందంలో భాగంగా సన్‌రైజర్స్‌ జట్టు సభ్యులు మైదానంలో ధరించేందుకు కాటన్‌ బ్లేజర్స్‌ను అందిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా నగరంలోని ఔట్‌లెట్లలో గ్రాడో కాటన్‌ కొత్త కలెక్షన్‌ను విడుదల చేసినట్లు ప్రకటించారు. వేడి వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని బీట్‌ ద హీట్‌ కాన్సెప్ట్‌తో వీటిని రూపొందించామన్నారు.


మరిన్ని తాజా క్రిడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:
https://www.vaartha.com/news/sports/