సన్‌రైజర్స్‌ విజయ భేరి

sunrisers hyderabad won the match of delhi capitals
sunrisers hyderabad won the match of delhi capitals

ఢిల్లీతో మ్యాచ్‌లో 5వికెట్ల తేడాతో హైదరాబాద్‌ ఘన విజయం…
ఈసీజన్‌లో హాట్రిక్‌ విజయాన్ని నమోదు చేసిన సన్‌రైజర్స్‌….

న్యూఢిల్లీµ: ఐపిఎల్‌ 12వ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ హాట్రిక్‌ విజయాన్ని నమోదు చేసింది. ఓటమితో టోర్నీని ఆరంభించినప్పటికీ ఆతర్వాత ఆతర్వాత సొంతగడ్డపై రెండు వరుస విజయాలు సాధించిన హైదరాబాద్‌ జట్టు గురువారం డిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈసీజన్‌లో సన్‌రైజర్స్‌ 4 మ్యాచ్‌లాడి మూడు విజయాలు, ఒక ఓటమి నమోదు చేయగా…ఢిల్లీ క్యాపిటల్స్‌ 5 మ్యాచ్‌లాడి రెండు విజయాలు, మూడు ఓటములు చవిచూసింది.ఢిల్లీలోని ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో సన్‌రైజర్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ నిర్ణీత 20ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. ఓపెనర్లు పృథ్వీషా (11), శిఖర్‌ ధావన్‌ (12) తక్కువ పరుగులకే ఔటయ్యారు. కాగా కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (43),రిషబ్‌ పంత్‌ (5)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నించినా పంత్‌ కూడా పెవిలియన్‌కు చేరాడు. పిచ్‌ నెమ్మదిగా మారడంతో మిగతా బ్యాట్స్‌మెన్‌ కూడా పెద్దగా రాణించలేదు. ఈ క్రమంలో శ్రేయస్‌ ఒక్కడే ఒంటరిపోరాటం చేశాడు. బ్యాట్స్‌మెన్‌ పరుగులు తీసేందుకు ఇబ్బందులు పడ్డారు.ఫస్ట్‌ డౌన్‌లో దిగిన అయ్యర్‌ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌్‌ ఆడాడు. మరొక ఎండ్‌ నుంచి సహకారం లభించలేదు. వచ్చిన వారు వచ్చినట్లు పెవిలియన్‌ బాట పట్టడంతో ఢిల్లీ స్కోరు నత్తనడకన సాగింది. మరొకసారి మిడిల్‌ ఆర్డర్‌ విపలమైంది. రిషబ్‌ పంత్‌, తెవాతియా, ఇన్‌గ్రామ్‌లు తీవ్రంగా నిరాశపరిచారు. దాంతో ఢిల్లీ స్కోరు వంద దాటడం కూడా కష్టమే అనిపించింది. చివర్లో అక్షర్‌ పటేల్‌ (23) రెండు సిక్సులు బాదడంతో ఢిల్లీ 129 పరుగులు చెయ్యగలిగింది. 130 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ జట్టులో బెయిర్‌ స్టో (48), చివర్లో మహ్మద్‌ నబీ (9బంతుల్లో 2ఫోర్లు, ఒక సిక్సర్‌తో 17 నాటౌట్‌) పరుగులతో రాణించడంతో సన్‌రైజర్స్‌ 18.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. 130పరుగుల లక్ష్యం తక్కువదే అయినప్పటికీ ఢిల్లీ బౌలర్లలో తెవాటియా, అక్షర్‌ పటేల్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌ వేయడంతో హైదరాబాద్‌ విజయానికి 18.3వరకు ఆడాల్సి వచ్చింది.
ఢిల్లీ బ్యాటింగ్‌ సాగిందిలా…
టాస్‌ ఓడి బ్యాటింగ్‌ ప్రారంభించిన ఢిల్లీ జట్టు ఆరంభంలోనే వికెట్‌ కోల్పోయింది. 2.2వ బంతికి పృథ్వీషా (11బంతుల్లో 2ఫోర్లతో 11) భువనేశ్వర్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యి తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. ఆతర్వాత 5.6వ బంతికి మరో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (14బంతుల్లో ఒక ఫోర్‌తో 12) నబీ బౌలింగ్‌లో సందీప్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఈ దశలో శ్రేయస్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. కానీ 9.1 వ బంతికి రిషబ్‌ ప్‌ం (7బంతుల్లో 5) నబీ బౌలింగ్‌లో దీపక్‌ హుడా క్యాచ్‌ ఇచ్చి మూడో వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. మరో 10బంతుల వ్యవధిలోనే 10.5వ బంతికి రాహుల్‌ తివారి (7బంతుల్లో ఒక ఫోర్‌తో 5) సందీప్‌ శర్మ బౌలింగ్‌లో నబీకు క్యాచ్‌ ఇచ్చి నాలుగో వికెట్‌గా ఔటయ్యాడు. ఆతర్వాత 13.3వ బంతికి కొలిన్‌ ఇంగ్రామ్‌ (8బంతుల్లో 5) కౌల్‌ బౌలింగ్‌లో మనీష్‌ పాండేకు క్యాచ్‌ ఇచ్చి ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. ఒక పక్క వికెట్లు పడుతున్నా శ్రేయస్‌ అయ్యర్‌ ఒంటరి పోరాటం చేశాడు. ఈ క్రమంలో 16.1వ బంతికి శ్రేయస్‌ అయ్యర్‌ (41బంతుల్లో 3ఫోర్లు, ఒక సిక్సర్‌తో 43) రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో ఔటై ఆరోవికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. 18.2 వబంతికి క్రిస్‌ మోరిస్‌ (15బంతుల్లో ఒక ఫోర్‌, ఒక సిక్సర్‌తో 17) భువనేశ్వర్‌ బౌలింగ్‌లో నబీకి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. మరో 6బంతుల వ్యవధిలోనే 19.2వ బంతికి రబాడా (4బంతుల్లో 3) కౌల్‌ బౌలింగ్‌లో భువనేశ్వర్‌కు క్యాచ్‌ ఇచ్చి 8 వికెట్‌గా ఔటయ్యాడు. చివర్లో అక్షర్‌ పటేల్‌ (13బంతుల్లో ఒక ఫోర్‌, రెండు సిక్సర్లతో 23 నాటౌట్‌)గా నిలవడంతో ఢిల్లీ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. సన్‌రైజర్స్‌ బౌలర్లలో భువనేశ్వర్‌, మహ్మద్‌ నబీ, సిద్ధార్థ్‌ కౌల్‌ రెండేసి వికెట్లు తీయగా రషీద్‌ ఖాన్‌, సందీప్‌ శర్మ చెరో వికెట్‌ పడగొట్టారు.
సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ సాగిందిలా….
130 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ జట్టులో ఓపెనర్లు ఆచితూచి ఆడారు. ఒక పక్క డేవిడ్‌ వ్నార్‌ నెమ్మదిగా ఆడుతుంటే, బెయిర్‌ స్టో బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఆరు ఓవర్లు పూర్తయ్యే సరికి వికెట్‌ కోల్పోకుండా 62 పరుగులు చేసింది. ఈక్రమంలో 6.5వ బంతికి బెయిర్‌ స్టో (28బంతులోల 9ఫోర్లు, ఒక సిక్సర్‌తో 48) రాహుల్‌ తెవాటియా బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆతర్వాత 7 బంతుల వ్యవధిలోనే 7.6వ బంతికి డేవిడ్‌ వార్నర్‌ (18బంతుల్లో 10) రబాడా బౌలింగ్‌లో క్రిస్‌ మోరిస్‌కు క్యాచ్‌ ఇచ్చి రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. ఓపెనర్లు ఔటవ్వడంతో విజ§్‌ు శంకర్‌, మనీశ్‌ పాండేలో ఆచితూచి ఆడారు. 12 ఓవర్లు ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. ఆతర్వాత 12.6వ బంతికి మనీశ్‌ పాండే (13బంతుల్లో 10) ఇషాంత్‌ బౌలింగ్‌లో పృథ్వీషాకు క్యాచ్‌ ఇచ్చి మూడో వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఆతర్వాత 14.3వ బంతికి విజ§్‌ు శంకర్‌ (21బంతుల్లో ఒక ఫోర్‌తో 16) అక్షర్‌ బౌలింగ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ వెంటనే 15.6వ బంతికి దీపక్‌ హూడా (11బంతుల్లో ఒక ఫోర్‌తో 10) లామిచెనె బౌలింగ్‌లో రబాడాకు క్యాచ్‌ ఇచ్చి 5వ వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. చివర్లో (11బంతుల్లో ఒక ఫోర్‌తో 9), మహ్మద్‌ నబీ (9బంతులో 2ఫోర్లు, ఒక సిక్సర్‌తో 17) అజేయంగా నిలవడంతో సన్‌రైజర్స్‌ 18.3 ఓవర్లలో 5 వికెట్ల నస్టానికి 131 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో లామిచెనె, అక్షర్‌ పటేల్‌, రబాడా, తెవాటియా, ఇషాంత్‌ శర్మ తలో వికెట్‌ తీశారు.


మరిన్నీ తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/