స్వంత గ్రౌండ్‌లో సన్‌రైజర్స్‌ విజయం…

sunrisers hyderabad won the match by rr
sunrisers hyderabad won the match by RR

హైదరాబాద్‌ :ఐపిఎల్‌లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌రాయల్స్‌ జట్ల మధ్య హైదరాబాద్‌ ఉప్పల్‌ వేదికగా శుక్రవారంజరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచిన తొలుత బ్యాటింగ్‌చేసిన రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టులో మిడిల్డార్‌ ఈ ఐపిఎల్‌ సీజన్‌లో తొలి శతకం నమోదు చేశాడు. సంజూ శాంసన్‌ (55బంతుల్లో 10ఫోర్లు, 4సిక్సర్లతో 102 నాటౌట్‌) అజేయ శతకంతో ఆకాశమే హద్దుగా చెలరేగగా…ఓపెనర్‌ అజింక్యా రహానె (49బంతుల్లో 4ఫోర్లు,మూడు సిక్సర్లతో 70) పరుగులు చేయడంతో బాదడంతో ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది.199పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్‌ జట్టులో వార్నర్‌ ఆరంభం నుంచి విధ్వంసకర ఇన్నింగ్స్‌్‌ ఆడాడు. వార్నర్‌ (37బంతుల్లో 9ఫోర్లు, రెండు సిక్సర్లతో 69), జానీ బెయిర్‌స్టో 28బంతుల్లో 6ఫోర్లు, ఒక సిక్సర్‌తో 45), విజ§్‌ు శంకర్‌ (15బంతుల్లో ఒక ఫోర్‌, 3సిక్సర్లతో 35) విధ్వంసకర బ్యాటింగ్‌ చేయడంతో హైదరాబాద్‌ 19 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి 5వికెట్ల తేడాతో విజయం సాధించింది.
రాజస్థాన్‌ బ్యాటింగ్‌ సాగిందిలా….
టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ రాయల్స్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ (5) ఆరంభంలోనే ఔటయ్యాడు. రషీద్‌ వేసిన 3.2బంతికి జోస్‌ బట్లర్‌ క్లీన్‌ బౌల్డయ్యాడు. బంతిని స్వీప్‌ చేయబోయి లెగ్‌ వికెట్‌ వదిలేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్‌…మరోఓపెనర్‌ అజింక్యా రహానెతో కలిసి నిలకడగా ఆడారు. ఆచితూచి బ్యాటింగ్‌ చేస్తూ వికెట్‌ పడనివ్వలేదు. అందివచ్చిన బంతుల్ని బౌండరీకి తరలించారు. నిదానంగా జోరు పెంచి సునామిలీ విరుచుకుపడ్డారు. రెండో వికెట్‌కు అభేద్యంగా 119 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే…15.1వ బంతికి జట్టు స్కోరు 134 పరుగుల వద్ద రహానె (49బంతుల్లో 4ఫోర్లు, మూడు సిక్సర్లలో 7) నదీమ్‌ వేసిన బంతిని భారీ సిక్సర్‌ బాదాడు. బౌండరీలైన్‌ వద్ద మనీశ్‌ పాండేకు చిక్కి రెండో వికెట్‌గా ఔటయ్యాడు. రహానె ఔటయ్యాక శాంసన వీర విహారం చేశాడు. ఈక్రమంలో (55బంతుల్ల 10ఫోర్లు, 4సిక్సర్లతో 102) అజేయ శతకం సాధించాడు. దీంతో శాంసన్‌ ఈసీజన్‌లో తొలి శతకం, ఐపిఎల్‌లో రెండో శతకం నమోదు చేశాడు. బెన్‌స్టోక్స్‌ (9బంతుల్లో 3ఫోర్లతో 16) చేయడంతో రాజస్థాన్‌ రాయల్స్‌ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. హైదరాబాద్‌ బౌలర్లల రషీద్‌ ఖాన్‌, నదీమ్‌చెరో వికెట్‌ తీశారు.
సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ సాగిందిలా….
199 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టులో ఓపెనర్లు తొలి ఓవన్‌ నుంచే దూకుడుగా ఆడారు. తొలి ఓవర్‌లోనే ఒక సిక్సర్‌, రెండు ఫోర్లతో విరుచుకుపడ్డాడు. అదే దూకుడును కొనసాగించాడు. ఐదో వోర్‌లో స్టోక్స్‌కు వార్నర్‌ చుక్కలు చూపించాడు. మూడు బౌండరీలు బాదాడు. 6 ఓవర్లకు హైదరాబాద్‌ వికెట్‌ నష్టపోకుండా 69 పరుగులు చేసింది. డేవిడ్‌ వార్నర్‌ (27బంతుల్లో 8ఫోర్లు, ఒకసిక్సర్‌తో 52) అర్థ సెంచరీ బాదేశాడు. అర్థసెంచరీ తర్వాత కూడా వార్నర్‌ దూకుడును కొనసాగించాడు. ఈక్రమంలో 9ఓవర్లలో 100పరుగుల మైలురాయిని దాటింది. ఆతర్వాత బెన్‌స్టోక్స్‌ వేసిన 9.4వ బంతిని ఫైన్‌లెగ్‌లోకి తరలించబోయి డేవిడ్‌ వార్నర్‌ (37బంతుల్లో 9ఫోర్లు, రెండు సిక్సర్లతో 69) కులకర్ణికి క్యాచ్‌ ఇచ్చి తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. 10ఓవర్లకు హైదరాబాద్‌ ఒక వికెట్‌ నష్టానికి 115 పరుగులు చేసింది. ఆతర్వాత శ్రేయాస్‌ గోపాల్‌ వేసిన 10.6వ బంతిని భారీ సిక్సర్‌గా మలిచే క్రమంలో బెయిర్‌స్టో (6ఫోర్లు, ఒక సిక్స్‌తో 45) కులకర్ణికి చిక్కి రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. ఆతర్వాత విజయశంకర్‌ దూకుడు పెంచాడు. సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఆ తర్వాత 14.4వ బంతిని ఆడబోయిన విలియమ్సన్‌ (10బంతుల్లో రెండు ఫోర్లతో 14) ఉన్కదత్‌ బౌలింగ్‌లో మూడో వికెట్‌గా ఔటయ్యాడు. అప్పటికి హైదరాబాద్‌ 15 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఆతర్వాత 15.3వబంతికి శ్రేయస్‌ గోపాల్‌ బౌలింగ్‌లో విజ§్‌ు శంకర్‌( 15బంతుల్లో ఒక ఫోర్‌, మూడు సిక్సర్లతో 35) సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌కు క్యాచ్‌ ఇచ్చి నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత బంతికే మనీశ్‌ పాండే ఎల్‌బిడబ్ల్యుగా 5వికెట్‌గా ఔటయ్యాడు. ఆతర్వాత యూసఫ్‌ పఠాన్‌ (12బంతుల్లో ఒక సిక్సర్‌తో 16 నాటౌట్‌), రషీద్‌ ఖాన్‌ (8బంతుల్లో ఒక ఫోర్‌, ఒకసిక్సర్‌తో 15నాటౌట్‌) అజేయంగా నిలవడంతో 19 ఓవర్లలో హైదరాబాద్‌ జట్టు 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. రాజస్థాన్‌ బౌలర్లలో శ్రేయస్‌ గోపాల్‌ 3, బెన్‌స్టోక్స్‌, ఉన్కదత్‌ చెరో వికెట్‌ తీశారు.

మరిన్నీ తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/