IPL 2022 : RCB ఫై SRH ఘన విజయం

IPL 2022 లో సన్ రైజర్స్​ హైదరాబాద్ విజయ యాత్ర కొనసాగుతుంది. శనివారం జరిగిన మ్యాచ్​లో ఆర్​సీబీ ఫై 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ముంబాయిలోని బ్రబోర్న్‌ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు తలపడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. 2 ఓటముల తరువాత 4 విజయాలతో జోష్‌ మీదున్న ఆరెంజ్‌ ఆర్మీ పటిష్టమై ఆర్సీబీ జట్టుపై విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. బరిలోకి దిగిన ఆర్సీబీ 68 ప‌రుగుల‌కే కుప్ప‌కూలి అందరినీ షాక్‌కు గురిచేసింది. ప్రభుదేశాయ్​(15), మాక్స్​వెల్​(12) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. కోహ్లీ పేలవ ఫామ్​ కొనసాగిస్తూ వరుసగా రెండో మ్యాచ్​లో గోల్డెన్​ డకౌట్​గా వెనుదిరిగాడు.

ఆర్​సీబీలో కోహ్లీ, అనుజ్​ రావత్​, దినేశ్​ కార్తిక్​ డకౌటయ్యారు. హైదరాబాద్​ బౌలర్లలో మార్కో జాన్సెన్​, నటరాజన్​ తలో 3 వికెట్లు తీయగా.. సుచిత్​ రెండు, భువనేశ్వర్​, ఉమ్రాన్​ మాలిక్​ చెరో వికెట్​ తీశారు. 69 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 8 ఓవర్లలోనే ఛేదించింది. అభిషేక్​ శర్మ 28 బంతుల్లోనే 47 పరుగులు చేశాడు. కెప్టెన్​ కేన్​ విలియమ్సన్(16 నాటౌట్​), రాహుల్​ త్రిపాఠి(7 నాటౌట్​) లాంఛనాన్ని పూర్తి చేశారు. ఏకైక వికెట్​ హర్షల్​ పటేల్​కు దక్కింది. ఈ విజయంతో మంచి రన్​రేట్​ సాధించిన హైదరాబాద్​.. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది.