ఢిల్లీ జోరుకు రైజర్స్‌ చెక్‌

88 పరుగులతో హైదరాబాద్‌ గెలుపు

దుబాయ్: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సత్తా చాటింది. మేటి జట్టు ఢిల్లీ కేపిటల్స్‌పై 88 పరుగులతో సాధికార విజయం అందుకుంది.

తొలుత సన్‌రైజర్స్‌ 2 వికెట్లకు 219 పరుగులు భారీ స్కోరు సాధించగా, సమాధానంగా ఢిల్లీ కేపిటల్స్‌ 19 ఓవర్లలో 131 పరుగులకు కుప్పకూలింది.

హైదరాబాద్‌ జట్టులో ఓపెనర్లు కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌(66), వృద్ధిమాన్‌ సాహ(87) అర్ధసెంచరీలతో జట్ట భారీ స్కోరుకు దోహదం చేశారు.

ఆ తరువాత రషీద్‌ఖాన్‌ ఐపీఎల్‌లో తన అత్యుత్తమ గణాంకాలు(3/7) నమోదు చేసి విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. ఈ విజయంతో హైదరాబాద్‌కు ఒరింగిందేమీ లేదు. కాగా ప్లేఆఫ్స్‌కు చేరువవ్ఞదామనుకున్న ఢిల్లీకి అడ్డుకట్ట వేసింది.

ఇరు జట్లు 12 మ్యాచ్‌లు ఆడగా ఢిల్లీ 7 విజయాలతో 14 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతుండగా, హైదరాబాద్‌ అయిదు విజయాలతో ఆరో స్థానంలో నిలిచింది.


లక్ష్య ఛేదనలో ఢిల్లీ తడబడింది. తొలి ఓవర్లోనే ఫామ్‌లో ఉన్న ధావన్‌ వికెట్‌ కోల్పోయింది. తరువాత వచ్చిన స్టొయినిస్‌ ఎక్కువసేపు నిలువలేకపోయాడు.

ఈ తరుణంలో రహానె, హెట్మెయిర్‌ కొద్దిసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. హెట్మెయిర్‌ మూడు ఫోర్లతో మురిపించినా అది తాత్కాలికమే అయింది. పవర్‌ప్లే సమయానికి ఢిల్లీ మూడు వికెట్లకు 54 పరుగులు చేసింది. రషీద్‌ఖాన్‌ రంగప్రవేశంతో ఒక్కసారిగా ఆటతీరు మారిపోయింది.

రషీద్‌ తన తొలి ఓవర్‌ తొలి బంతికే హెట్మెయిర్‌ను, అయిదో బంతికి కుదురుగా ఆడుతున్న రహానెను బలిగొని మ్యాచ్‌ను హైదరాబాద్‌కు అనుకూలంగా మార్చాడు.

ఏడు ఓవర్లలో 54 పరుగులకే ఢిల్లీ ప్రధానబ్యాట్స్‌మెన్‌ను కోల్పోయింది. ఆపై చెప్పుకోదగ్గ జోడీ రిషభ్‌ పంత్‌, కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఇన్నింగ్స్‌ పునర్నిర్మించే ప్రయత్నం చేశారు.

అయితే రైజర్స్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో పరుగులు రావడం కష్టసాధ్యమైంది. శంకర్‌ కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ వికెట్‌ను దక్కించుకోవడంతో ఢిల్లీ పరాజయం ఖాయమైంది.

ఆపై ఢిల్లీ ఇన్నింగ్స్‌ ముగిసేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. అక్షర్‌ పటేల్‌, కగిసో రబాడా సింగిల్‌ డిజిట్‌కే వెనుతిరగగా, కుదురుకున్న పంత్‌(36)ను సందీప్‌ శర్మ పెవిలియన్‌ చేర్చాడు.

చివరలో తుషార్‌ రెచ్చిపోవడంతో ఢిల్లీ స్కోరు వంద పరుగులు దాటింది. 19 ఓవర్‌ చివరి బంతికి నార్జ్‌ అవ్ఞటవడంతో ఢిల్లీ ఇన్నింగ్స్‌ 131 పరుగులకు ముగిసింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన రైజర్స్‌కు ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌, వృద్ధిమాన్‌ సాహా శుభారంభం అందించారు. సమర్ధంగా హైదరాబాద్‌ బౌలర్లను ఎదుర్కొంటూ సగటున ఓవర్‌కు పది పరుగులు పైగా సాధిస్తూ పవర్‌ప్లే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 77 పరుగులు జోడించారు.

బర్త్‌డే బాయ్ వార్నర్‌ సిక్సర్లు, ఫోర్లతో చెలరేగి 25 బంతుల్లో అర్ధసెంచరీ పూరించాడు.

ముఖ్యంగా రబాడా వేసిన ఆరో ఓవర్లో వార్నర్‌ ఒక సిక్సర్‌, నాలుగు ఫోర్లతో దుమ్మురేపాడు. ఈ సీజన్‌లో పవర్‌ప్లేలో అర్ధసెంచరీ నమోదు చేసిన తొలి ఆటగాడయ్యాడు.

ఓపెనర్ల ధాటికి తొమ్మిదో ఓవర్లోనే సన్‌రైజర్స్‌ స్కోరు వంద పరుగులు దాటింది. ఎట్టకేలకు అశ్విన్‌ తన మూడో ఓవర్లో వార్నర్‌ను అవ్ఞట్‌ చేయడంద్వారా ఈ జోడీని విడదీశాడు.

వార్నర్‌ 34 బంతుల్లో రెండు సిక్సర్లు, ఎనిమిది ఫోర్లతో 66 పరుగులు చేసి అక్షర్‌ క్యాచ్‌ పట్టగా వెనుతిరిగాడు. సాహాతో కలిసి వార్నర్‌ తొలి వికెట్‌కు 107 పరుగులు జోడించాడు.

తరువాతి ఓవర్లో సాహా ఓ బౌండరీతో తన అర్ధసెంచరీ పూరించాడు. సాహా 27 బంతుల్లో 9 బౌండరీల సాయంతో ఈ మైలురాయి చేరుకున్నాడు. ఆ తరువాతకూడా సాహా వెనుతిరిగి చూడలేదు.

సిక్సర్లు, ఫోర్లతో పరుగులు కొల్లగొట్టాడు. ప్రమాదకరంగా పరిణమిస్తున్న ఈ భాగస్వామ్యానికి నార్జ్‌ తెరదించాడు. భారీ షాట్‌కు ప్రయత్నించిన సాహా మిడాఫ్‌లో శ్రేయాస్‌ అయ్యర్‌కు క్యాచ్‌ ఇచ్చి నిష్క్రమించాడు.

సాహా 45 బంతుల్లో రెండు సిక్సర్లు, 12 ఫోర్లతో 87 పరుగులు చేశాడు. రెండో వికెట్‌కు మనీష్‌ పాండేతో కలిసి 63 పరుగులు జోడించాడు.

ఓపెనర్ల నిష్క్రమణతో కొద్దిసేపు స్కోరు వేగం మందగించింది. ఆ తరువాత మనీష్‌ పాండే బ్యాట్‌ ఝుళిపించడంతో 18 ఓవర్లో స్కోరు 200 దాటింది. అంతేగాక ఈ సీజన్‌లో దుబా§్‌ు స్టేడియంలో అత్యధిక స్కోరును నమోదు చేసింది.

బెంగళూరుపై పంజాబ్‌ సాధించిన 206/3 స్కోరును సన్‌రైజర్స్‌ అధిగమించింది. నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి పాండే(44 నాటౌట్‌), విలియమ్సన్‌(11నాటౌట్‌) మరో వికెట్‌ పడకుండా స్కోరును 219 పరుగులకు చేర్చారు. రైజర్స్‌కు చివరి అయిదు ఓవర్లలో 44 పరుగులే రాబట్టగలిగారు.

స్కోర్‌బోర్డ్‌ :

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ – డేవిడ్‌ వార్నర్‌ సి అక్షర్‌ పటేల్‌ బి అశ్విన్‌ 66, వృద్ధిమాన్‌ సాహా సి శ్రేయాస్‌ అయ్యర్‌ బి నార్జ్‌ 87, మనీష్‌ పాండే నాటౌట్‌ 44, కేన్‌ విలియమ్సన్‌ నాటౌట్‌ 11,
ఎక్స్‌ట్రాలు 11, మొత్తం(20 ఓవర్లలో 2 వికెట్లకు)219.

వికెట్ల పతనం : 1-107, 2-170.
బౌలింగ్‌ : అన్రిచ్‌ నార్జ్‌ 4-0-37-1; కగిసో రబాడా 4-0-54-0; రవిచంద్రన్‌ అశ్విన్‌ 3-0-35-1; అక్షర్‌ పటేల్‌ 4-0-36-0; తుషార్‌ దేశ్‌పాండే 3-0-35-0; మార్కస్‌ స్టొయినిస్‌ 2-0-15-0.

ఢిల్లీ కేపిటల్స్‌ –

అజింక్య రహానె ఎల్బీ రషీద్‌ ఖాన్‌ 26, శిఖర్‌ ధావన్‌ సి వార్నర్‌ బి సందీప్‌ శర్మ 0, మార్కస్‌ స్టొయినిస్‌ సి వార్నర్‌ బి నదీమ్‌ 5, షిమ్రాన్‌ హెట్మెయిర్‌ బి రషీద్‌ ఖాన్‌ 16, రిషభ్‌ పంత్‌ సి గోస్వామి బి సందీప్‌ శర్మ 36, శ్రేయాస్‌ అయ్యర్‌ సి విలియమ్సన్‌ బి శంకర్‌ 7, అక్షర్‌ పటేల్‌ సి ప్రియం గార్గ్‌ బి రషీద్‌ ఖాన్‌ 1, కగిసో రబాడా బి నటరాజన్‌ 3, రవిచంద్రన్‌ అశ్విన్‌ సి అబ్దుల్‌ సమద్‌ బి హోల్డర్‌ 7, తుషార్‌ దేశ్‌పాండే , అన్రిచ్‌ నార్జ్‌ సి ప్రియం గార్గ్‌ బి నటరాజన్‌ 1,

ఎక్స్‌ట్రాలు , మొత్తం(19 ఓవర్లలో ఆలౌట్‌)131.
వికెట్ల పతనం : 1-1, 2-14, 3-54, 4-55, 5-78, 6-83, 7-103, 8-103, 9-125, 10-131.
బౌలింగ్‌ : సందీప్‌ శర్మ 4-0-27-2; షాబాజ్‌ నదీమ్‌ 1-0-8-1; జాసన్‌ హోల్డర్‌ 4-0-46-1; రషీద్‌ ఖాన్‌ 4-0-7-3; టి.నటరాజన్‌ 3.4-0-26-1; విజ§్‌ు శంకర్‌ 1.5-0-11-1; డేవిడ్‌ వార్నర్‌ 0.1-0-2-0.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/