సన్‌రైజర్స్‌ అన్ని విభాగాల్లో సమతూకంగా ఉంది : భువనేశ్వర్‌ కుమార్‌

Bhuvneshwar Kumar
Bhuvneshwar Kumar

న్యూఢిల్లీ: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ విజయాలతో దూసుకెళుతోంది. ఇప్పటికే పాయింట్ల పట్టికలో అగ్రస్థానం కైవసం చేసుకుంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌తో పాటు అన్ని విభాగాల్లో సమతూకంగా ఉంది. గురువారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఢిల్లీని 5 వికెట్ల తేడాతో ఓడించింది. కెప్టెన్‌, కీలక ఆటగాడు కేన్‌ విలియమ్సన్‌ జట్టుకు దూరమవడంతో పేస్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ సారథ్య బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. సన్‌రైజర్స్‌ హ్యాట్రిక్‌ విజయంపై భువనేశ్వర్‌ మాట్లాడారు. జట్టు సమిష్టిగా రాణిస్తే సారథ్యం వహించడం మరింత సులభతరం అవుతుంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అన్ని విభాగాల్లో సమతూకంగా ఉంది. చివరి రెండు మ్యాచుల్లోనూ పిచ్‌ది ఒకే విధమైన పరిస్థితి. కోట్లాలో బంతిని బాదడం అంత సులువు కాదని తెలుసు. ఢిల్లీతో మ్యాచ్‌లో 140 నుంచి 150 పరుగుల లక్ష్యం ఉంటే ఛేదనకు కాస్త శ్రమించాల్సి వస్తుందనుకున్నాం. ప్రణాళిక ప్రకారం ప్రత్యర్థిని అంతలోపే కట్టడిచేశాం. తర్వాత బ్యాటింగ్‌లో మా బ్యాట్స్‌మెన్‌ బెయిర్‌స్టో అద్భుతంగా ఆడాడు. 28బంతుల్లో 48 పరుగులు చేసి జట్టుకు శుభారంభం ఇవ్వడంతో పాటు విజయానికి బాటలు వేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలవడం చాలా కీలక పాత్ర పోషించింది. ఢిల్లీ బ్యాటింగ్‌ చేసే సమయంలో పిచ్‌ ఎలా స్పందిస్తుందో పరిశీలించాం. అలా చేయడం వల్ల లక్ష్యాన్ని ఛేదించేందుకు మాకు బాగా ఉపయోగపడుతుందని భువనేశ్వర్‌ కుమార్‌ తెలిపాడు.


మరిన్నీ తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చెయండి : https://www.vaartha.com/news/sports/