సంతృప్తి చెందలేదు..అయినా సుప్రీం తీర్పును గౌరవిస్తాం

సున్నీ వక్ఫ్‌ బోర్డు లాయర్‌

sunni waqf board lawyer
sunni waqf board lawyer

న్యూఢిల్లీ: అయోధ్య కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తుది తీర్పును తాము గౌరవిస్తున్నామని సున్నీ వక్ఫ్‌ బోర్డు లాయర్‌ జిలానీ తెలిపారు. సుప్రీం తీర్పు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సుప్రీం తీర్పును తాము గౌరవిస్తున్నప్పటికీ ఆ తీర్పుతో తాము సంతృప్తి చెందలేదని ఆయన పేర్కన్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని, ఆపై నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. అయోధ్యలోని వివాదస్పద భూమి హిందువులకే చెందుతుందని, తక్షణమే ఆ భూమిని హిందువులకు అప్పగించాలని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. చరిత్రకారులు, పర్యాటకులు అయోధ్యను రామజన్మభూమిగా నమ్ముతారని, అయితే నమ్మకమనేది వ్యక్తిగతమని, న్యాయ సూత్రాల ఆధారంగా భూమిపై హక్కులు వస్తాయని సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో సున్నీ వక్ఫ్‌ బోర్డు లాయర్‌ జిలానీ పైవిధంగా స్పందించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/