పెంచలయ్యగా సునీల్ ఫస్ట్ లుక్ రిలీజ్

జిన్నా చిత్రం నుండి సునీల్ తాలూకా ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు మేకర్స్. గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న విష్ణు..ప్రస్తుతం జిన్నా అనే సినిమా చేస్తున్నాడు. సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కథా, స్క్రీన్ ప్లే, కోనా వెంకట్ అందించడం విశేషం. ఈ మూవీ తెలుగు తో పాటు హిందీ, తమిళ, మలయాళం భాషలో రూపొందుతోంది. ఈ చిత్రంలో మంచు విష్ణు సరసన పాయల్ రాజ్ పుత్, సన్నీలియోన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ పూర్తీ చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ తో సినిమా ఫై ఆసక్తి పెంచేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే పలు సాంగ్స్ , టీజర్ రిలీజ్ చేసి మెప్పించిన మేకర్స్..శుక్రవారం సునీల్ తాలూకా లుక్ ను రిలీజ్ చేసారు.

ఈ సినిమాలో సునీల్ ‘పెంచలయ్య’ పాత్రలో కనిపించనున్నాడు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు. ఈ సినిమాలో సునీల్ కమెడియన్ గానే సందడి చేశాడనే విషయం ఈ పోస్టర్ చూస్తేనే అర్థమైపోతోంది. పెళ్లి కొడుకు లుక్ తో ఉన్న ఆయనలో భయం – బాధ రెండూ కనిపిస్తూనే ఉన్నాయి. అందుకు కారణం ఏమై వుంటుందా అనేది తెలియాలంటే ఈ సినిమా చూడవలసిందే.