తెలంగాణ విషయంలో బిజెపి మరో కీలక నిర్ణయం..కొత్త బాస్ ను రంగంలోకి దింపింది

రాబోయే ఎన్నికల్లో తెలంగాణ లో ఎలాగైనా గెలిచి తీరాలనే లక్ష్యం తో బిజెపి సన్నాహాలు చేస్తుంది. ఇప్పటీకే ఆకర్ష్ పేరుతో ఇతర పార్టీల నేతలను తమ పార్టీలోకి ఆహ్వానిస్తుంది. పలువురు నేతలు ఇప్పటికే కాషాయం కండువా కప్పుకోగా..ఈ నెల 21 తర్వాత మరికొంతమంది చేరబోతున్నారు. ఈ తరుణంలో బిజెపి మరో కీలక నిర్ణయం తీసుకుంది.

తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నాల్లో భాగంగా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ ను మార్చింది. తరుణ్ చుగ్ స్థానంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సునీల్ రైట్ హ్యాండ్ గా వ్యవహరించే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ను నియమించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణతో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు జనరల్ సెక్రటరీగా నియమించింది. ఉత్తర్ ప్రదేశ్‌లో 2017లో బీజేపీ విజయం సాధించడంలో సునీల్ బన్సాల్‌ కీలక పాత్ర పోషించారు. 2022లో యూపీలో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి రావడానికి విశేషంగా కృషి చేశారు. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంతో పాటు అభ్యర్థుల ఎంపిక వరకూ ప్రత్యేక శ్రద్ధ వహించి పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించినట్లు బన్సల్‌కు గుర్తింపు ఉంది. అంతేకాదు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఆయణ్ని రైట్ హ్యాండ్‌గా రాజకీయ వర్గాలు అభివర్ణిస్తాయి. సునీల్ బన్సల్ ప్రస్తుతం బీజేపీ ఉత్తర్ ప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. తాజాగా ఆయనకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రమోషన్ ఇచ్చారు.

1969 సెప్టెంబర్ 20న రాజస్థాన్ లో జన్మించారు సునీల్. ఏబీవీపీ నాయకుడిగా ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన.. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ ప్రచారక్ గా వ్యవహరించారు. 2010 నుంచి 14 వరకు యూత్ ఎగైన్స్ట్ కరప్షన్ నేషనల్ కన్వీనర్ గా పనిచేశారు. 2014లో యూపీ ఎన్నికల కో ఇంఛార్జ్ గా పనిచేసిన ఆయన.. 2017లో ఉత్తర్ ప్రదేశ్ స్టేట్ జనరల్ సెక్రటరీగా పదోన్నతి పొందరు. 20-17లో ఉత్తర్ ప్రదేశ్లో బీజేపీని గెలిపించిన వ్యక్తిగా ఆయనకు గుర్తింపు ఉంది.