త్రివిక్రమ్ సినిమాలో విలన్ వేషాలు వేస్తోన్న మర్యాద రామన్న

త్రివిక్రమ్ సినిమాలో విలన్ వేషాలు వేస్తోన్న మర్యాద రామన్న

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ ఏడాది అల వైకుంఠపురములో చిత్రంతో అదిరిపోయే బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నాడు. ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించగా అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. కాగా ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని యంగ్ టైగర్ ఎన్టీ్ఆర్‌తో కలిసి చేసేందుకు త్రివిక్రమ్ రెడీ అయ్యాడు. అయితే ఈ సినిమాను లాంఛ్ చేసినా ఇంకా షూటింగ్ మాత్రం మొదలుకాలేదు.

అయితే త్రివిక్రమ్ సినిమాలో కమెడియన్ సునీల్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మెయిన్ విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. కాగా ఈ సినిమాలో మరో విలన్ పాత్రలో సునీల్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో త్రివిక్రమ్ సినిమాల్లో సునీల్‌కు మంచి ప్రాముఖ్యత ఉన్న పాత్రలు దక్కేవి. అయితే హీరోగా మారిన తరువాత సునీల్ ఫెయిల్యూర్ అవుతుండటంతో మళ్లీ క్యారెక్టర్ పాత్రలు చేస్తున్నాడు.

కాగా ఇటీవల సునీల్ కలర్ ఫోటో చిత్రంలో నెగెటివ్ రోల్‌లో నటించగా ఆయన పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి. దీంతో ఇప్పుడు త్రివిక్రమ్ సినిమాలో మరోసారి నెగెటివ్ పాత్ర చేసేందుకు సునీల్ సిద్ధమయ్యాడు. మరి ఈసారి సునీల్‌ను త్రివిక్రమ్ ఎలా చూపించబోతున్నాడో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే. ఇక ఈ సినిమాకు ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసినట్లు టాక్.