ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసిన ఈసీ

న్యూఢిల్లీ : 17వ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. జూన్ 3న ప్రస్తుత లోక్ సభ ముగియన్న తరుణంలో, మే నెలలో ఎన్నికలను నిర్వహించేందుకు ఈసీ షెడ్యూల్ ను ప్రకటించింది. ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ సునీల్ అరోరా షెడ్యూల్ ను విడుదల చేశారు. లోక్‌సభ ఎన్నికలు ఏడు విడతల్లో జరుగనున్నట్లు సీఈసీ తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఒకే విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 11న ఎన్నికలు జరుగనున్నాయి.
మార్చి 18న మొదటి నొటిఫికేషన్‌ విడుదల
ఏప్రిల్‌ 11న తొలి విడత లోక్ సభ ఎన్నికలు
ఏప్రిల్ 18న రెండోదశ లోక్ సభ ఎన్నికలు
ఏప్రిల్ 23న మూడో దశ లోక్ సభ ఎన్నికలు
ఏప్రిల్ 29న నాలుగో దశ లోక్ సభ ఎన్నికలు
మే 6న ఐదో దశ లోక్ సభ ఎన్నికలు
మే 12న ఆరోదశ లోక్ సభ ఎన్నికలు
మే 19న ఏడో దశ లోక్ సభ ఎన్నికలు
కౌంటింగ్ తేదీ మే 23. ఈ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. తాలు