గేమ్ ఛేంజర్ మూవీ ఫై సునీల్ ఆసక్తికర కామెంట్స్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – శంకర్ కలయికలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ ఫై యాక్టర్ సునీల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది. ఈ మూవీ లో చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈరోజు చరణ్ బర్త్ డే సందర్బంగా సినిమా తాలూకా టైటిల్ ను తో పాటు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి ఆసక్తి పెంచారు.
తాజాగా ఈ సినిమా గురించి కమెడియన్ సునీల్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసి సినిమా పై అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలను భారీగా పెంచాడు. ఇటీవల ఒక చిట్ చాట్ లో ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సునీల్ మాట్లాడుతూ.. గేమ్ ఛేంజర్ సినిమా మరో రేంజ్ లో ఉండబోతుంది. దర్శకుడు శంకర్ గారి గత చిత్రాలకు ఏమాత్రం తక్కువ కాకుండా అద్భుతంగా గేమ్ ఛేంజర్ ఉంటుందని.. రామ్ చరణ్ అభిమానులతో పాటు ప్రతి ఒక్కరిని కూడా గేమ్ ఛేంజర్ సినిమా సర్ ప్రైజ్ చేసే విధంగా ఉంటుందని పేర్కొన్నాడు.