నాడా ప్రచారకర్తగా సునీల్‌ శెట్టి

Sunil Shetty
Sunil Shetty

న్యూఢిల్లీ: ఈ సంవత్సరం 150 మందికి పైగా అథ్లేట్లు డోపింగ్‌లో దొరికిపోయిన సంగతి తెలిసిందే. అందులో బాడీబిల్డర్లు 1/3వంతు ఉన్నారు. కాగా క్రీడలలో డోపింగ్‌ను ఆరికట్టడానికి నాడా శ్రీకారం చుట్టింది. క్రీడాకారులను స్వచ్ఛంగా ఉంచేందుకు బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టిని జాతీయ డోపింగ్‌ నిరోధక వ్యవస్థక (నాడా)కు ప్రచారకర్తగా నియమించారు. టోక్యో ఒలంపిక్స్‌్‌కు ఎక్కువ సమయం లేకపోవడంతో క్రీడాకారులను స్వచ్ఛంగా ఉంచేందుకు సునీల్‌ శెట్టి ఇమేజ్‌ని ఉపయోగించుకోవాలని నాడా భావిస్తుంది. అథ్లేట్‌, మాజీ అథ్లెట్‌కన్నా ఓ నటుడు దేశవ్యాప్తంగా మరింత ఎక్కువ ప్రభావం చూపగలరు. అందుకే క్రీడల్లో డోపింగ్‌ను దూరం చేసే చర్యల్లో భాగంగా సునీల్‌ శెట్టిని బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపిక చేశామని తెలిపారు. అంతేకాకుండా తాజా అథ్లెట్లు వివిధ టోర్నిల్లో బిజీగా ఉండటంతో ప్రచారానికి తగిన సమయం కేటాయించలేరు అని నాడా తెలిపింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/