యమధర్మరాజు కుమార్తె సునీధ

ఆధ్యాత్మిక చింతన

Devotional stories

సునీధ చక్కని చుక్క. ఒకరోజు ఆమె తన చెలికత్తెలతో కలిసి వనవిహారానికి వెళ్లింది. ఆ వనంలో సుశంఖుడనే గంధర్వుడు వాగ్ధేవిని గురించి తపస్సు చేసుకుంటున్నాడు.

సునీధ ఆ మునిపుంగవ్ఞని చూసింది. అతని జుట్టు పట్టి లాగింది. అంతటితో ఊరుకోకుండా అతడిని కొట్టింది. సుశంఖుడు కళ్లు తెరిచి సునీధను చూసి కుమారీ! కోపమెందుకమ్మా.

నేను నీకు ఏం అపకారం చేశాను. తపోభంగం కలిగించావ్ఞ. తాపసులు నీవ్ఞ కొడితే తిరిగి కొట్టరు.

తిడిగే తిరిగి తిట్టరు. ఆ విషయం తెలుసుకో. మా జోలికి రాకు. మా తపోదీక్షకు అంతరాయం కలిగించకు అని ఎంతో సౌమ్యంగా చెప్పాడు.

సునీధ ఇంటికి వెళ్లి వనంలో తాపసికి ఏ విధంగా తపోభంగం చేసి ఆటపట్టించిందో ఆ పాపకృత్యం అంతా తండ్రికి వివరంగా చెప్పింది

. యమధర్మరాజు కూతురుపై గల ప్రేమతో ఆమె చేసిన పని తప్పు పాపకృత్యమని చెప్పలేదు. విని మౌనం వహించాడు.

తండ్రి ఉపేక్షించడంతో సునీధ మర్నాడు మళ్లీ వెళ్లి సుశంఖుడికి తపోభంగం కలిగించింది. అంతేకాదు కొట్టి హింసించింది.

సుశంఖుడు కోపంతో రుద్రకారుడై, పాపాత్మురాలా! నీవ్ఞ చేసిన ఈ పాపకృత్యానికి తగిన ఫలం నీ ప్రథమ గర్భాన మహాపాపి నీకు జన్మించుగాక అని శపించాడు. ఇంటికి వెళ్లి సునీధ జరిగిన వృత్తాంతం తండ్రికి చెప్పింది.

జరిగిన దానికి యమధర్మరాజు ఎంతో విచారించాడు. ఈ విషయం గోప్యంగా ఉంచి కూతురికి పెళ్లి చెయ్యాలని నిశ్చయించాడు.

సునీధ శావ విషయం దేవలోకమంతా వ్యాపించింది. అందుచేత మెను వివాహం చేసుకునేందుకు ఎవరూ అంగీకరించలేదు.

యమధర్మరాజుకు ఆవేదన రోజురోజుకు పెరుగుతూంది. కూతుర్ని చూసినప్పుడల్లా యముడికి దుఃఖం పొంగుకొస్తుంది. మునులను తాపసులను సాధువ్ఞలను బాధించడం హాపాపం. నీ పాపపరిహారం కోసం తపస్సు చేసుకోవడం తప్ప మరో మార్గం లేదు.

కనుక నీవ్ఞ వెంటనే తపోదీక్ష చేపట్టు అని కూతురికి చెప్పాడు. తండ్రి ఆజ్ఞ మేరకు సునీధ తపస్సు చేయ సంకల్పించి అడవికి బయల్దేరింది. ఆమెకు తోవలో రంభ ఇతర అప్సరసలు కనిపించారు. సునీధ వారికి విషయం చెప్పింది. తపస్సు అంటే మాటలు కాదు నీలాంటి సుకుమారి తపస్సు చేయడం చాలా కష్టం. తట్టుకోలేవ్ఞ. ఇంద్రాది దేవతలే ఘోరమైన పాపకృత్యాలు చేసి శాపగ్రస్థులయ్యారు.

వారు చేసిన పాపాలతో పోలిస్తే నీవ్ఞ చేసిన పాపం ఏ పాటిది? ఉత్తమ స్త్రీకి ఉండవలసిన రూపం, శీలం, సత్యం, ఆర్యత్వం, ధర్మం, సతీత్వం, దార్ధ్యం సాహసం, గనం, వ్యవసాయం, కామం మధురవాక్కు అనే ద్వాదశగుణాలు నీలో కనబడుతున్నాయి.

నీవ్ఞ భయపడకు. కీర్తివంతుడైన భర్త నీకు లభిస్తాడు అని సునీధకు ధైర్యం చెప్పింది రంభ. పురుష సన్మోహన విద్య ఉపదేశించింది.

సునీధ తపపస్సు మాట విడిచి వారి వెంట వెళ్లింది. భాగీరథీ తీరంలో ఒక మంచి పుంగవ్ఞని చూసి అతని వివరాలు అడిగింది. బ్రహ్మకుమారుడు అత్రి ప్రజాపతి. ఆ అత్రికుమారుడు ఇతను. పేరు అంగుడు. ఇంద్రవిభుడైన కుమారుని కోసం తపస్సు చేసి శ్రీమహావిష్ణువ్ఞని మెప్పించి వరం పొందాడు.

వివాహం చేసుకునేందుకు తగిన కన్య కోసం అన్వేషిస్తున్నాడు ఇతనే నీకు తగిన భర్త అంది రంభ. వెంటనే సునీధ అతనిపై పురుష సన్మోహన విద్య ప్రయోగించింది. అంగుడు సునీధను చూసి మోహితుడై ఆమె వివారలు రంభ ద్వారా తెలుసుకున్నాడు.

సునీధను గాంధర్వ వివాహం చేసుకున్నాడు అంగుడు. వారికి వేనుడు అనే పేరు గల పుత్రుడు జన్మించాడు. యుక్తవయసు రాగానే వేనుడు రాజ్యాధికారం చేపట్టాడు. అతని సునీధకు సుశంఖుడు ఇచ్చిన శాపం వల్ల వేనుడు వేదధర్మాలను విడిచి పెట్టి అధార్మికుడు అయ్యాడు.

మునులను ప్రజలను పిలిపించి దానధర్మాలు యజ్ఞయాగాలు చేయకూడదని శాసించాడు. తాను చెప్పిందే ధర్మం అన్నాడు.

తన శాసనాన్ని ధిక్కరించిన వారిని కఠినంగా శిక్షించాడు. యమధర్మరాజు తన కూతురి మీద ప్రదర్శించిన అలసత్వ వైఖరి వల్ల జరిగిన అనర్ధం. వేనుడికి పృధువ్ఞ అనే కుమారుడు జన్మించిన తరువాత తన ప్రవర్తనకు చింతించి తపస్సుకు ఉపక్రమించాడు.

అతని తపోదీక్షకు శ్రీమహావిష్ణువ్ఞ ప్రసన్నుడై తత్వోపదేశం చేశాడు. ఆ విధంగా వేనుడు అటు తల్లికి ముని ఇచ్చిన శాపం. ఇటు తండ్రికి శ్రీహరి ఇచ్చిన వరం రెండూ అనుభవించాడు. ధర్మదేవత తప్పిదం వల్ల మృత్యుదోషం వల్ల.

  • ఉలాపు బాలకేశవులు

తాజా కెరీర్‌ సమాచారం కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/