హీరో సందీప్‌ కిషన్‌ అమరావతిలో మరో కొత్త వ్యాపారం

Sundeep Kishan
Sundeep Kishan

అమరావతి: సినిమా రంగంలోని ప్రముఖులు వ్యాపారాలు చేయడం ఇప్పుడు సర్వసాధారణం. ఇప్పటికే పలువురు హీరో, హీరోయిన్లు వ్యాపారాలు ప్రారంభించారు. ఇదే మార్గంలో హీరో సందీప్‌ కిషన్‌ కూడా ఒకవైపు సినిమాలు చేసుకుంటూనే మరోవైపు వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. కాగా ఇప్పటికే వివాహ భోజనంబు పేరుతో సందీప్‌ కిషన్‌ రెస్టారెంట్లను నడుపుతున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు మరో వ్యాపారంతో అందరి ముందుకు వస్తున్నారు ఈ యువ హీరో. ఏపి రాజధాని అమరావతిలో ఓ సెలూన్‌ ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. క్యూబిఎస్‌ సెలూన్‌ ఈ రంగంలో పేరుపొందిన ఒక సంస్థ ఇప్పుడు ఈ సంస్థ ఫ్రాంచైజీని సందీప్‌ కిషన్‌ తీసుకున్నారు. అతిత్వరలో ఈ సెలూన్‌ను ఆయన ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ఆయన ఏ1 ఎక్స్‌ప్రెస్‌ సినిమాలో నటిస్తున్నారు. అంతేకాకుండా నిర్మాతగా మారి కూడా నిను వీడని నీడను నేనే అనే సినిమాను తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నారు సందీప్‌ కిషన్‌.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/