ట్యాంక్‌బండ్‌పై మళ్లీ స‌న్‌డే ఫ‌న్‌డే సంబరాలు

ట్యాంక్‌బండ్ పై మళ్లీ సండే ఫ‌న్‌డే సంబరాలు మొదలుకాబోతున్నాయి. కరోనా కు ముందు నగర వాసులు ఆదివారం సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదిస్తూ సందడి చేసేవారు. అంతర్జాతీయ నగరాల అందాలకు ఏమాత్రం తీసి పోని విధంగా హుస్సేన్‌సాగర్‌ తీర ప్రాంతాన్ని ప్రభుత్వం తీర్చిదిద్దడంతో నగర వాసులను ప్రత్యేకంగా ఆకర్షించేది. కానీ కరోనా కారణంగా గత రెండేళ్లుగా ఈ సందడికి బ్రేక్ పడింది.

కాగా రేపు (ఆదివారం) నుంచి మ‌ళ్లీ మొద‌లుకానున్నాయి. రేపు సాయంత్రం 4 గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల దాకా ట్యాంక్‌బండ్‌పై స‌న్‌డే ఫ‌న్‌డే వేడుక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ వేడుక‌ల నేప‌థ్యంలో ట్యాంక్‌బండ్‌పై సాయంత్రం 4 గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల దాకా వాహ‌నాల రాక‌పోక‌ల‌ను నిలిపివేస్తున్న‌ట్లు హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు శ‌నివారం ప్ర‌క‌టించారు. ఆ స‌మ‌యంలో ట్యాంక్‌బండ్ మీదుగా వెళ్లాల‌నుకునే వారు ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను ఎంచుకోవాల‌ని సూచించారు. ఇక దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ ట్యాంక్‌బండ్‌పై సందడి నెలకొనబోతుంది.