జెఫ్‌ బెజోస్‌కు సుందర్‌ పిచాయ్ అభినందనలు

అమెజాన్ చీఫ్ గా వైదొలగనున్న జెఫ్

న్యూయార్క్‌: అమెజాన్ వ్యవస్థాపకుడిగా, అత్యంత కుబేరుడిగా ఉన్న జెఫ్ బెజోస్, తాను చీఫ్ ఎగ్జిక్యూటివ్ బాధ్యతల నుంచి తప్పుకుంటానని ప్రకటించడంపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, జెఫ్ బెజోస్ కు శుభాభినందనలు తెలిపారు. ఇదే సమయంలో జెఫ్ ప్రారంభించిన రెండు కార్యక్రమాలు విజయవంతం కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ‘కంగ్రాట్స్ జెఫ్ బెజోస్… ‘డే వన్’ మరియు ‘ఎర్త్ ఫండ్’ కార్యక్రమాలు విజయవంతం కావాలి. కొత్త బాధ్యతలు స్వీకరించనున్న ఆండీ జెస్సీకి కూడా అభినందనలు’ అని అన్నారు.

కాగా, జెఫ్ బెజోస్ ఈ సంవత్సరం తన బాధ్యతల నుంచి తప్పుకోనుండగా, ప్రస్తుతం అమెజాన్ వెబ్ సర్వీసెస్ అధిపతిగా ఉన్న ఆండీ జెస్సీ కొత్త సీఈఓ బాధ్యతలను చేపట్టనున్నారు. సెప్టెంబర్ తరువాత తన బాధ్యతలను ఆండీ జెస్సీకి అప్పగించనున్నట్టు జెఫ్ బెజోస్ ప్రకటించిన సంగతి తెలిసిందే.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/