రజనీకాంత్ కు సమన్లు!

జనవరి 19న కమిషన్‌ ఎదుట విచారణకు హాజరుకావాలని ఆదేశం

Rajanikanth
Rajanikanth

Chennai: తూత్తుకుడి ఆందోళనల ఘటనకు సంబంధించి సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు మరోసారి సమన్లు జారీచేశారు. రెండేళ్ల కిందటి ఘటనలో, ఆయన చేసిన అసాంఘిక శక్తుల వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ మాజీ జస్టిస్‌ అరుణ జగదీశన్‌ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్‌ సమన్లు ఇచ్చింది.

వచ్చే ఏడాది జనవరి 19న కమిషన్‌ ఎదుట విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. తూత్తుకుడిలోని వేదాంత స్టెరిలైట్‌ రాగి కర్మాగారాన్ని శాశ్వతంగా మూసేయాలంటూ అప్పట్లో పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయి. నిరసనకారు లపై పోలీసులు కాల్పులు జరపడంతో, 13 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఆందోళనలో అసాంఘిక శక్తులు చేరడం వల్లే, పోలీసులు కాల్పులు జరిపారని వివాదాస్పద వ్యాఖ్య లు చేశారు. దీనిపై రాజకీయంగా దుమారం రేగింది. ఆ తర్వాత తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు రజనీ నిరాక రించారు. ఎలా తెలిసిందో నన్నడగండి.. నాకు అన్నీ తెలు సు అంటూ వ్యాఖ్యానించడం, ఆ తర్వాత దానిపై క్షమాపణ లు చెప్పడం జరిగింది.

కానీ, అసాంఘిక శక్తుల ప్రమేయం అనే మాటను వెనక్కితీసుకోలేదు. దాంతో ఆనాటి సంఘట నను విచారిస్తున్న ఏకసభ్య కమిషన్‌ రజనీకి మరోసారి సమన్లు ఇచ్చింది.

పార్టీ ప్రారంభానికి ముహూర్తం ఖరారు..

రజనీకాంత్‌ కొత్త పార్టీ ప్రారంభానికి ముహూర్తం నిర్ణ యించారు. జనవరిలో పార్టీని ప్రారంభిస్తానని ఇప్పటికే రజనీ ప్రకటించారు. ఇందుకు మూడు తేదీలను ప్రాథమి కంగా నిర్దారించారు. జనవరి 14, 17, 21 తేదీలలో ఏద్రి బలమైన ముహూర్తం త్వరలో తేల్చనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

జనవరి 14 తమిళ ప్రజలకు ప్రత్యేక మైనది. పొంగల్‌ పండుగను ఘనంగా నిర్వహించుకునే రోజు. ఇక జనవరి 17 ఎంజీ రామచంద్రన్‌ జయంతి.

దాదాపు ఈ రెండు తేదీల్లో ఒకదాన్ని ఖరారు చేస్తారని తెలు స్తోంది. డిసెంబర్‌ 31న రజనీ పార్టీకి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/