పాక్‌ రాయబారికి సమన్లు

Sohail Mahmood
Sohail Mahmood, pak high commissioner

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌ హై కమీషనర్‌ సోహేల్‌ మహమూద్‌కు ఇవాళ భారత విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. విదేశాంగ కార్యదర్శి విజ§్‌ు గోఖలే ఈ విషయాన్ని వెల్లడించారు. పుల్వామాలో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ పాక్‌ రాయబారికి సమన్లు జారీ చేసింది. పాక్‌ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌పై పాక్‌ వెంటనే కఠిన నిర్ణయం తీసుకోవాలని పాక్‌ రాయబారిని భారత్‌ ఆదేశించింది. పాక్‌ నేలపై నుంచి సాగుతున్న అన్ని రకాల ఉగ్ర కార్యకలాపాలను అడ్డుకునే చర్యలు చేపట్టాలని కోరింది. పుల్వామా దాడిపై గురువారం పాక్‌ విదేశాంగ శాఖ చేసిన ప్రకటనను భారత విదేశాంగ కార్యదర్శి ఖండించారు.