భారత్‌ పసిడి దరువు

భారత్‌ పసిడి దరువు

గోల్డ్‌కోస్ట్‌ : కామన్వెల్త్‌ క్రీడ ల్లో భారత అథ్లెట్లు పసిడి దరువు మోగిస్తున్నారు.పోటీపడి స్వర్ణాల పంట పండించడంతో భారత్‌ పతకాల పట్టికలో (59) మూడో స్థానాన్ని పదిలం చేసుకుంది. పదవ రోజు ఏకంగా 8 స్వర్ణం, 5 రజతం, 4 కాంస్యంతో 17 పతకాలను భారత్‌ తన ఖాతాలో వేసుకుంది. అథ్లెటి క్స్‌లో నీరజ్‌ చోప్రా, బాక్సింగ్‌లో మేరీకోమ్‌,గౌరవ్‌ సోలం క్‌,వికాష్‌కృష ్ణన్‌,షూటింగ్‌లో సంజీవ్‌ రాజ్‌పుట్‌, రెజ్లింగ్‌లో సుమిత్‌ మాలిక్‌, వినేష్‌ పోగట్‌,స్వర€పతకాలు చేజిక్కించుకు న్నారు.టేబుల్‌ టెన్నిస్‌లో మనిక బాత్ర స్వర్ణం కైవసం చేసు కుంది.ఈనేపథ్యంలో స్వర్ణ పతకాల సంఖ్య 25కు చేరగా,బాక్సింగ్‌లో అమిత్‌పంగల్‌, మనీష్‌ కౌశిక్‌,సతీష్‌ రజతం దిక్కంచు కోవడంతో రజతాల సంఖ్య 16కు చేరగా,సాక్షిమాలిక్‌, సోమ్‌వీర్‌, బాడ్మింటన్‌ మహిళల డబుల్స్‌లో అశ్వని, సిక్కిరెడ్డి కాంస్యం కైవసం చేసుకోవడంతో కాంస్యాల సంఖ్య 18కి చేరింది.

ఇక్కడి కరార అథ్లెటిక్స్‌ స్టేడియంలో శుక్రవారం జరిగిన పురుషుల జావలిన్‌ త్రోలో నీరజ్‌ చోప్రా 86.47 మీటర్లు విసరి ప్రథమ స్థానం పొంది స్వర్ణం కైవసం చేసుకోగా, ఇదేవిభాగంలో పోటీ పడిన విపిన్‌కసన 77.87మీటర్లు విసరి ఐదో స్థానంలో నిలలిచాడు.ట్రిపుల్‌ జంప్‌లో 16.46 మీటర్లు దూకి అర్పీందర్‌ సింగ్‌ తృటిలో కాంస్యం చేజార్చుకుని నాలుగో స్థానంతో సరి పెట్టుకున్నాడు. బాక్సింగ్‌లో పసిడి పంచ్‌ మహిళల బాక్సింగ్‌లో స్టార్‌ బాక్సర్‌ మేరీకోమ్‌ పంచ్‌కు స్వర్ణం జాలువారింది. 48 కేజీల విభాగంలో పోటీ పడిన మేరీకోమ్‌ ప్రత్యర్థి నార్త్‌ఐర్లాండ్‌కు చెందిన ఓహరను 5-0తో మట్టికరిపించింది.పురుషుల 52 కేజీల్లో గౌరవ్‌ సోలంకి స్వర్ణం చేజ్కిం చుకున్నాడు.వికాష్‌ కృష్ణన్‌ 75 కేజీల విభాగంలో 5-0తో నిట్‌సెన్‌గ్‌ పై విజయం సాధించి స్వర్ణం దక్కించుకున్నాడు.

గౌరవ్‌ 52 కేజీల విభాగంలో ఇర్విన్‌పై 4-1తో నెగ్గాడు. కాగా,49 కేజీల ఫైనల్లో 1-3తో యాఫయి (ఇంగ్లండ్‌) చేతిలో పరాజయం పాలైన అమిత్‌ పంగల్‌ రజతం దక్కించు కున్నాడు.మనీష్‌కౌశిక్‌ 60 కేజీల విభాగంలో 2-3తో గార్‌సైడ్‌ (ఆస్ట్రేలియా)చేతిలో ఓటమి చవిచూసి రజతం కైవసం చేసుకున్నాడు. అదే విధంగా సతీష్‌ కుమార్‌ 0-5తో క్లార్క్‌ (ఇంగ్లండ్‌) చేతిలో పరాజయం పొంది రజతం దక్కించుకున్నాడు. సంజీవ్‌కు షూటింగ్‌ స్వర్ణం పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్‌ పిస ్టల్‌లో సంజీవ్‌రాజ్‌పుట్‌ ప్రథమస్థానంలో నిలిచి స్వర్ణం చేజిక్కంచుకున్నా డు.ఫైనల్లో 454.4 పా యింట్లు సాంధించాడు. రెజ్లింగ్‌లో డబుల్‌ ధమాకా రెజ్లింగ్‌లో భారత రెజ్లర్లు పతకాల పంట పండించ డంతో రెండు స్వర్ణాలు, రెండు కాంస్య పకతాలు లభిం చాయి.సుమిత్‌ మాలిక్‌ 125 కేజీల హెవీ వెయిట్‌ ప్రి స్టయిల్‌లో స్వర్ణం సాధించాడు.బోల్టిక్‌ (నైజీరియా)పై ఫైనల్లో 5-0తో ఆలవోకగా విజయం సాధించాడు.మహిళల 62కేజీల ప్రి స్టయిల్‌ విభాగం సెమీస్‌లో సాక్షిమాలిక్‌ 3-1తో ఫోర్డ్‌ (న్యూజిలాండ్‌) చేతిలో పరాజయం పొంది కాంస్యంతో సరిపెట్టుకుంది.

పురుషుల 86 కేజీల్లో సోమ్‌వీర్‌ కడియాన్‌ 3-1తో మోర్‌ (కెనడా) చేతిలో పరాజయం చవిచూసి కాంస్యం దక్కించుకున్నాడు. టిటిలో మనికకు స్వర్ణం మహిళల టేబుల్‌ టెన్నిస్‌ సింగిల్స్‌లో మనిక బాత్ర స్వర్ణం చేజిక్కించుకుంది. ఫైనల్లో 4-0తో యు (సింగపూర్‌)పై నెగ్గింది.పురుషుల డబుల్స్‌లో శరత్‌, సతియాన జోడి 0-2తో డ్రింక్‌హాల్‌ (ఇంగ్లండ్‌) చేతిలో ఓటమిపాలై రజతం చేజిక్కించుకున్నారు.పురుషుల డబు ల్స్‌ లో హర్మీత్‌ దేశా§్‌ు, సనీల్‌ శెట్టి జోడి కాంస్యం దక్కించుకున్నారు. స్క్వాష్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రజం స్క్వాష్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో భారత్‌కు రజతం లభించింది.ఫైనల్లో 0-2తో దీపిక,సతియాన జోడిపై డ్రింక్‌, పిల్లీ (ఆస్ట్రేలియా) జంట నెగ్గారు. అదేవిధంగా మహిళల డబుల్స్‌లో జోత్స్న, దిపికా జోడి 2-0తో మసరో,పెర్రీపై సెమీస్‌లో నెగ్గి ఫైనల్స్‌కుచేరుకున్నారు. మహిళల డబుల్స్‌కు కాంస్యం బాడ్మింటన్‌ మహిళల డబుల్స్‌లో భారత్‌కు కాంస్యం లభించిం ది.మూడు నాలుగుస్థానాల కోసం జరిగిన పోరులో అశ్వని పొన్నప్ప, సిక్కి రడ్డి జోడి 2-0తో నెగ్గి కాంస్యపతకం చేజ్కించుకున్నారు.పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌ ఒన్‌ ర్యాంకర్‌ కిదాంబి శ్రీకాంత్‌ 2-0తో సెమీస్‌లో ఔసెప్‌ (ఇంగ్లండ్‌)పైనెగ్గి ఫైనల్స్‌కు చేరగా, ప్రణ§్‌ుకుమార్‌ 1-2తో లీ (మలేషియా) చేతిలో పరాజయం పాలయ్యాడు. మహిళల సెమీస్‌లో సైనా నెహ్వాల్‌ 2-1తో గిల్‌మోర్‌ (స్కాట్‌లాండ్‌)పై, పివిసింధు2-0తో లి (కెనడా)పై నెగ్గి పైనల్స్‌ చేరారు. ఫైనల్లో సైనాతో సింధు తలపడనుంది.మిక్స్‌డ్‌ డబుల్స్‌సెమీస్‌లో అశ్వని పొన్నప్ప, సాత్విక్‌ సాయిరాజ్‌ జోడి 1-2 తో పరాజయం పొందారు. హాకీ జట్లు ఘోర పరాజయం కామన్వెల్త్‌ క్రీడల్లో పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత్‌ హాకీ జట్ల అంచనాలు తప్పాయి. ఊహించినట్టే సెమీస్‌కు చేరిన పురుషుల,మహిళల జట్లు ఓటమి చెంది కాంస్య పతకం కోసం పోటీపడాల్సి వచ్చింది. ఇరు జట్లు ఇంగ్లండ్‌తో మూడు నాలుగు స్థానాల కోసం పోటీపడి పరాజ యం పొందాయి. ఇక్కడి ఆస్ట్రోటర్ఫ్‌ హాకీ స్టేడియంలో జరిగిన మహిళల మ్యాచ్‌లో 0-6 గోల్స్‌తో ఇంగ్లండ్‌ చిత్తు చేసింది. లీగ్‌లో ఆజట్టుపై నెగ్గిన భారత్‌ చేతులెత్తేసిం ది.దీంతో బ్రే హ్యాట్రిక్‌ గోల్స్‌ చేయడంతో ఘోర పరాజయం తప్పలేదు.పురుషుల జట్టు సై తం 1-2 గోల్స్‌తో ఇంగ్లం డ్‌చేతిలో పరాజయం పొ ందింది. ఈనేపథ్యంలో ఇరు జట్లు రిక హస్తంతో వెను తిరిగాయి